Aakasamlo OKa Tara: ‘ఆకాశంలో ఒక తార’ హీరోయిన్ ఎంట్రీ.. సరికొత్తగా గ్లింప్స్!
ఆకాశంలో ఒక తార(Aakasamlo OKa Tara) సినిమాలో హీరోయిన్ ని పరిచయం చేస్తూ గ్లింప్స్ విడుదల చేసిన మేకర్స్.
Satvika Veeravalli glimpse Released from Aakasamlo Oka Tara movie.
- దుల్కర్ హీరోగా ఆకాశంలో ఒక తారా
- హీరోయిన్ గా సాత్విక వీరవల్లి
- సమ్మర్ కు విడుదల కానున్న సినిమా
Aakasamlo OKa Tara: మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ తెలుగు మూవీ ఆకాశంలో ఒక తార(Aakasamlo OKa Tara). దర్శకుడు పవన్ సాధినేని తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమక్షలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఈ సినిమా. తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ ని పరిచయం చేస్తూ గ్లింప్స్ విడుదల చేశాడు మేకర్స్. ఈ సినిమాలో కొత్త అందం సాత్విక వీరవల్లి హీరోయిన్ గా నటించనుంది. గ్లింప్స్ లో ఆమెకు సంబందించిన షాట్స్ చాలా బాగున్నాయి. అలాగే, ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను కూడా పెంచేసింది. సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
KOKA Teaser: వరుణ్ తేజ్ కొత్త సినిమా ‘కొక’.. టీజర్ అదిరిపోయింది
