KOKA Teaser: వరుణ్ తేజ్ కొత్త సినిమా ‘కొక’.. టీజర్ అదిరిపోయింది

వరుణ్ తేజ్ కొత్త సినిమా 'కొక' టీజర్(KOKA Teaser) విడుదల అయ్యింది.

KOKA Teaser: వరుణ్ తేజ్ కొత్త సినిమా ‘కొక’.. టీజర్ అదిరిపోయింది

Varun Tej Korean Kanakaraju Movie teaser released.

Updated On : January 19, 2026 / 11:30 AM IST
  • ‘కొరియన్ కనకరాజు’గా వరుణ్ తేజ్
  • టీజర్ విడుదల చేసిన టీం
  • సమ్మర్ కి థియేటర్స్ కి రానున్న సినిమా

KOKA Teaser: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. ఆయన నుంచి వచ్చిన లాస్ట్ సినిమా మట్కా. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. దాంతో, చాలా గ్యాప్ తీసుకున్న వరుణ్ తేజ్ ఈసారి హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. ఈ నేపధ్యంలోనే దర్శకుడు మేర్లపాక గాంధీతో జతకట్టాడు. చాలా కాలం క్రితమే ఈ సినిమా అధికారికంగా ప్రారంభం అయ్యింది. దాదాపు షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది.

Sreeleela: పాపం.. శ్రీలీలది నిజంగా బ్యాడ్ లక్కే.. సూపర్ హిట్ సినిమా మిస్ అయ్యింది!

తాజాగా హీరో వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా నుంచి టైటిల్ అండ్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. కొరియన్ బ్యాక్డ్రాప్ లో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రానుంది అని ముందే చెప్పారు మేకర్స్. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు(KOKA Teaser)’ అనే వెరైటీ టైటిల్ ను ఫిక్స్ చేశారు. టీజర్ కూడా చాలా కొత్తగా ఉంది. వరుణ్ తేజ్ లుక్ కూడా నెక్స్ట్ లెవల్లో సెట్ చేశాడు దర్శకుడు మేర్లపాక గాంధీ.

చూస్తుంటే ఈ సినిమాతో వరుణ్ తేజ్ సాలీడ్ కంబ్యాక్ ఇస్తాడని అనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో మిరాయ్ బ్యూటీ రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. కమెడియన్ సత్య కీ రోల్ చేస్తున్న ఈ సినిమా సమ్మర్ కి రిలీజ్ కానుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.