2021 సమ్మర్ వరకు సినిమా థియేటర్లు మూత

క‌రోనావైర‌స్ వ్యాప్తి ఆందోళ‌న‌లు,లాక్ డౌన్ ల కారణంగా ఇటు దేశవ్యాప్తంగా,అటు ప్రపంచవ్యాప్తంగా సినిమా హాళ్లు మూత‌ప‌డి నాలుగు నెల‌లు దాటిపోయింది. కొన్ని చోట్ల సినిమా థియేటర్లు ఇటీవల తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే అది మన దేశంలో కాదులేండి.

మన దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అయినప్పటి ఆన్ లాక్ లో భాగంగా కొన్ని షరతులతో సినిమా,సీరియల్స్ షూటింగ్స్ కు అనుమతి లభించిన విషయం తెలిసిందే. అయితే థియేటర్లు మాత్రం ఇంకా తిరిగి తెరుచుకోలేదు. ఎప్పుడు థియేటర్లు తిరిగి ప్రారంభమవుతాయో ఇంకా క్లారిటీ రాలేదు.

అయితే అమెరికాలో మాత్రం మిడ్ 2021 వరకు సినిమా హాల్స్ తిరిగి తెరుచుకునే అవకాశం లేదంట. ప్రస్తుతం ప్రపంచంలో కరోనా ఉదృతి అధికంగా ఉన్న నెం.1 దేశంగా అమెరికా నిలిచిన విష్యం తెలిసిందే. అమెరికాలో రోజు రోజుకి రికార్డు స్థాయిల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గురువారం(జులై-16,2020)ఒక్కరోజే అమెరికాలో 77వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

మరోవైపు,ఇప్పటి వరకు కరోనాకు పూర్తి స్థాయి వ్యాక్సిన్‌ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో అమెరికాలో 2021 సమ్మర్ వరకు సినిమా హాళ్లు తెరిగి తెరుచుకునే అవకాశం లేదని అమెరికాకు చెందిన ఓ ప్రముఖ విశ్లేషకుడు తెలిపారు.

కోవెన్ విశ్లేషకుడు డగ్ క్రీట్జ్ (హెచ్ / టి హాలీవుడ్ రిపోర్టర్) ది వాల్ట్ డిస్నీ కంపెనీకి స్టాక్‌పై తన రేటింగ్‌ను చాలావరకు మార్చారు, ఎందుకంటే వారి థీమ్ పార్కులు మరియు ఫీచర్ ఫిల్మ్ వ్యాపారంపై మహమ్మారి ప్రభావం ఉంది. 2021 వేసవి వరకు థియేటర్లు తెరవకపోవచ్చు. స్టూడియోలు తమ అతిపెద్ద సినిమాలను సామర్థ్యం-నిర్బంధమైన పాదముద్రలోకి విడుదల చేయడానికి ఆసక్తి చూపుతాయని మేము అనుకోము అని అయన తెలిపారు. 2020 ఆర్థిక సంవత్సరంలో సినిమా విడుదలలు ఏవీ ఉండవు అని వారు అంచనా వేశారు. COVID-19 యొక్క వ్యాప్తి సాపేక్షంగా ఆగిపోతుందని మేము గతంలో ఉహించామని, కానీ ప్రస్తుతం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని అన్నారు.