Anand Devarakonda : అన్నయ్యతో కలిసి ఫ్యూచర్ లో సినిమా ఉండొచ్చేమో.. దేవరకొండ బ్రదర్స్ మల్టీ స్టారర్?

డియన్స్ అన్నయ్య విజయ్ దేవరకొండతో సినిమా మల్టీస్టారర్ గురించి అడగగా ఆనంద్ మాట్లాడుతూ..

Anand Devarakonda : అన్నయ్యతో కలిసి ఫ్యూచర్ లో సినిమా ఉండొచ్చేమో.. దేవరకొండ బ్రదర్స్ మల్టీ స్టారర్?

Anand Devarakonda Comments on Multi Starrer Movie with Vijay Devarakonda

Updated On : September 15, 2023 / 9:08 PM IST

Anand Devarakonda : ఇటీవలే బేబీ(Baby) సినిమాతో భారీ హిట్ కొట్టాడు ఆనంద్ దేవ‌ర‌కొండ (Anand Deverakonda). సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా అన్నయ్యలాగా కమర్షియల్ సినిమాల జోలికి వెళ్లకుండా మొదటి సినిమా ‘దొర‌సాని’ నుంచి కూడా కొత్త కొత్త కథలతో వస్తున్నాడు. ఇప్పుడు త్వరలో ‘గం గం గణేశా’ (Gam Gam Ganesha) సినిమాతో రాబోతున్నాడు ఆనంద్ దేవ‌ర‌కొండ.

గం..గం..గణేశా సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న “గం..గం..గణేశా” సినిమా టీజర్ ను నేడు రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకులు శివ నిర్వాణ, అనుదీప్ కేవీ, కార్తీక్ దండు, డైరెక్టర్ వినోద్.. పలువురు పాల్గొన్నారు.

Bigg Boss Kannada : హ్యాపీ బిగ్‌బాస్.. కన్నడలో 100 రోజుల పండగ.. కన్నడ బిగ్‌బాస్ ప్రోమో చూశారా? హోస్ట్ ఎవరో తెలుసా?

ఈ ఈవెంట్ లో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ సినిమా నాగురించి మాట్లాడిన అనంతరం బేబీ సినిమాతో ఈ సినిమాకి కంపేర్ చేయను అని. దానికి అన్ని కోట్లు వచ్చాయని, ఇది అంతకు మించి దాటేస్తుందని లెక్కలు వేయను. ఏ సినిమా ప్రత్యేకత దానిదే అని అన్నాడు. అలాగే ఆడియన్స్ అన్నయ్య విజయ్ దేవరకొండతో సినిమా మల్టీస్టారర్ గురించి అడగగా ఆనంద్ మాట్లాడుతూ.. అన్నయ్య విజయ్ తో ఫ్యూచర్ లో కలిసి సినిమా ఉండొచ్చేమో, చేస్తానేమో చూడాలి. ఇప్పటికైతే అలాంటి ప్రాజెక్ట్ అనుకోలేదు. అనుకుంటే కచ్చితంగా చెప్తాను అని అన్నారు. దీంతో విజయ్ – ఆనంద్ దేవరకొండలు ఇద్దరూ ఒకే సినిమాలో కలిసి కనిపించాలని అభిమానులు అనుకుంటున్నారు.