Shivangi : ‘శివంగి’ మూవీ రివ్యూ.. ఓ పెళ్లయిన అమ్మాయికి ఒకేసారి అనేక సమస్యలు వస్తే..

ఓ అమ్మాయికి ఒకే రోజు అనేక సమస్యలు ఎదురైతే ఆ అమ్మాయి ఏం చేసింది అని ఆసక్తికర కథనంతో ఈ సినిమాని తెరకెక్కించారు.

Anandhi Varalaxmi Sarath Kumar Shivangi Movie Review and Rating

Shivangi Movie Review : ఆనంది మెయిన్ లీడ్ లో నటించిన సినిమా ‘శివంగి’. ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు నిర్మాణంలో దేవరాజ్ భరణి ధరన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. శివంగి సినిమా నేడు మార్చ్ 7న థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే.. సత్యభామ(ఆనంది) ఒకర్ని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది. అయితే సత్యభామ భర్త అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు. ఇంకో వైపు ఆమె అత్త మాటలతో వేధిస్తుంది. మరోవైపు ఈమెకు కొన్ని ఆర్ధిక సమస్యలు వెంటాడుతాయి. ఇంకోవైపు తన మాజీ బాయ్ ఫ్రెండ్ మళ్ళీ తన లైఫ్ లోకి వస్తాడు. ఇప్పటికే ఇలా సమస్యలతో చిక్కుకుపోయిన సత్యభామకు తన తల్లితండ్రులు వరదల్లో చిక్కుకు పోయారని వార్త తెలుస్తుంది.

ఇలా ఒకే రోజు సత్యభామకు అన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయంలో సత్యభామ పోలీసులను ఆశ్రయిస్తుంది. దీంతో పోలీసాఫీసర్(వరలక్ష్మి శరత్ కుమార్) సత్యభామ ఇంటికి వస్తుంది. అసలు సత్యభామ సమస్యలు ఏంటి? పోలీసులను ఎందుకు పిలిచింది? ఎవరైనా సత్యభామని ఇబ్బంది పెడుతున్నారా? సత్యభామ సమస్యలు తీరాయా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : NTR : ఎన్టీఆర్ కొత్త యాడ్ చూశారా? ఫ్రిడ్జ్ లో, వాషింగ్ మెషిన్ లో దూరి..

సినిమా విశ్లేషణ.. గతంలో క్లాస్ సినిమాలతో మెప్పించిన ఆనంది ఈ సినిమాలో కాస్త డిఫరెంట్ గా కనిపించింది. శివంగి సినిమా టీజర్, ట్రైలర్స్ లో ఆనంది మాస్ డైలాగ్స్ చెప్పడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ప్రేమించిన అబ్బాయి కాకుండా వేరే అబ్బాయిని పెళ్లి చేసుకొని ఇష్టం లేని కాపురం చేస్తున్న ఓ అమ్మాయికి ఒకే రోజు అనేక సమస్యలు ఎదురైతే ఆ అమ్మాయి ఏం చేసింది అని ఆసక్తికర కథనంతో ఈ సినిమాని తెరకెక్కించారు.

ఈ సినిమాలో చాలా తక్కువ మంది నటీనటులు ఉండటం, సినిమా అంతా ఒకే లొకేషన్ లో జరగటం గమనార్హం. ఇటీవల తక్కువ క్యారెక్టర్స్, సింగిల్ లొకేషన్ సినిమాలు కొత్తగా ట్రై చేస్తున్నారు. ఈ దర్శకుడు కూడా ఒక అమ్మాయికి పలు సమస్యలు పెట్టి ఒకే లొకేషన్ లోనే కథ అంతా నడిపించాడు. అక్కడక్కడా కాస్త బోర్ కొట్టినా నెక్ట్ ఏంటి అనే సస్పెన్స్ ని మెయింటైన్ చేసారు.

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఆనంది మాత్రం రెండు డిఫరెంట్ షేడ్స్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. వరలక్ష్మి శరత్ కుమార్ పోలీసాఫీసర్ పాత్రలో పవర్ ఫుల్ గా కనిపించింది. జాన్ విజయ్, కోయ కిషోర్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.

Also Read : Chhaava : సూపర్ హిట్ ‘ఛావా’ మూవీ రివ్యూ.. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ కథ..

సాంకేతిక అంశాలు.. సినిమా అంతా ఒకే ఇంట్లో కావడంతో ఇంట్లోనే డిఫరెంట్ ప్లేస్ లలో, డిఫరెంట్ షాట్స్ తో సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఒక్క లొకేషన్ ని కథకు తగ్గట్టు బాగా వాడుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సింగిల్ లొకేషన్ లో ఒక్క రోజు జరిగే కథతో తక్కువ పాత్రలతో దర్శకుడు కొత్తగా కథ రాసుకొని బాగానే డైరెక్ట్ చేసాడు. నిర్మాణ పరంగా తక్కువ బడ్జెట్ లోనే ఈ సినిమాని పూర్తి చేసినట్టు తెలుస్తుంది.

మొత్తంగా ‘శివంగి’ సినిమా ఓ మహిళకు ఒకేసారి పలు సమస్యలు వస్తే ధైర్యంగా ఎలా నిలబడింది అని ఆసక్తికర కథనంతో సస్పెన్స్ గా తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రం.