Godfather: అనంతపురం ఆటో కార్మికుల భారీ ర్యాలీ.. గాడ్‌ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్!

"నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు" అనే ఒక్క డైలాగ్ తో చిరంజీవి.. తన సినిమా "గాడ్ ఫాదర్"పై అంచనాలను అమాంతం పెంచేసాడు. దసరా కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఆతురతగా ఎదురు చూస్తున్నారు.

Anantapuram Auto Union Conducting Rally GodFather Movie Promotions

Godfather: “నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు” అనే ఒక్క డైలాగ్ తో చిరంజీవి.. తన సినిమా “గాడ్ ఫాదర్”పై అంచనాలను అమాంతం పెంచేసాడు. దసరా కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఆతురతగా ఎదురు చూస్తున్నారు.

Godfather: సల్మాన్ నటించాడంటే, ఆ క్రెడిట్ అతడిదే అంటోన్న గాడ్‌ఫాదర్

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర యూనిట్ అనంతపురం వేదికగా ఈ బుధవారం గ్రాండ్ గా నిర్వహించబోతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ఎవరెవరు రాబోతున్నారో ఇంకా తేలలేదు. కాగా అనంతపురం ఆటో కార్మికుల నేడు భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 100 ఆటోలతో గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ వేడుకలను ఈరోజు నుంచే స్టార్ట్ చేశారు.

మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, నయనతార, పూరీ జగన్నాధ్, సునీల్, సత్యదేవ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మరియు సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడు.