Ananya Panday : బాయ్‌ఫ్రెండ్‌కి బ్రేకప్ చెప్పేసిన ‘లైగర్’ భామ

అనన్య పాండే హీరో ఇషాన్ ఖట్టర్ తో గత మూడేళ్ళుగా ప్రేమలో ఉంది. వీరు డేటింగ్ కూడా చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి 'ఖాళి పీలి' అనే సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాకి ముందు నుంచే........

Ananya Panday : బాయ్‌ఫ్రెండ్‌కి బ్రేకప్ చెప్పేసిన ‘లైగర్’ భామ

Ananya Panday

Updated On : April 6, 2022 / 9:42 AM IST

Ananya Panday :  బాలీవుడ్ లో ప్రస్తుతం ఫామ్ లో ఉన్న యువ హీరోయిన్స్ లో అనన్య పాండే ఒకరు. అనన్య సినిమాలతోనే కాక సోషల్ మీడియాతో కూడా బాగా పాపులారిటీ తెచ్చుకుంటుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన లైగర్ సినిమాలో అనన్య పాండే నటించింది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. గత రెండు రోజులుగా బాలీవుడ్ లో అనన్య గురించి ఒక వార్త బాగా వినిపిస్తుంది.

Abhishek Agarwal : ‘కశ్మీర్ ఫైల్స్’ నిర్మాత బిజెపి నుంచి ఎమ్మెల్యేగా పోటీ??

అనన్య పాండే హీరో ఇషాన్ ఖట్టర్ తో గత మూడేళ్ళుగా ప్రేమలో ఉంది. వీరు డేటింగ్ కూడా చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి ‘ఖాళి పీలి’ అనే సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాకి ముందు నుంచే వీరిద్దరికి పరిచయం ఉంది. ఈ సినిమా టైంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. దాదాపు మూడు సంవత్సరాలుగా వీరు రిలేషన్ లో ఉన్నారు. తాజాగా అనన్య పాండే, ఇషాన్ ఖట్టర్ విడిపోయినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మూడేళ్ల పాటు డేటింగ్, ప్రేమ తర్వాత ఇప్పుడు అనన్య పాండే మరియు ఆమె ప్రియుడు ఇషాన్ ఖట్టర్ విడిపోయారు అని సమాచారం.