Ananya Panday : అవన్నీ అబద్దాలు.. అనన్య ఎవరితో ప్రేమలో లేదు.. క్లారిటీ ఇచ్చిన తల్లి..

బాలీవుడ్ లో రూమర్స్, గాసిప్స్ సహజమే. గత కొన్ని రోజులుగా అనన్య పాండే, బాలీవుడ్ యువ హీరో ఆదిత్య కపూర్ తో ప్రేమలో ఉందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఓ పార్టీలో అనన్య, ఆదిత్య క్లోజ్ గా ఉండటంతో ఈ వార్తలు మరింత ఎక్కువయ్యాయి.

Ananya Panday mother gives clarity on ananya love rumors

Ananya Panday :  బాలీవుడ్(Bollywood) స్టార్ కిడ్ అనన్య పాండేకి పలు హిందీ(Hindi) సినిమాల్లో నటించినా స్టార్ డం రాలేదు. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) సరసన లైగర్(Liger) సినిమాలో నటించి టాలీవుడ్(Tollywood) లో ఛాన్సులు కొట్టేయాలనుకుంది. కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో టాలీవుడ్ అసలు అనన్య వైపే చూడట్లేదు. లైగర్ సినిమా తర్వాత ఇంకే సినిమాలోనూ అనన్య పాండే(Ananya Panday)కనపడలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లోనే ఓ మూడు సినిమాలు చేస్తుంది అనన్య.

బాలీవుడ్ లో రూమర్స్, గాసిప్స్ సహజమే. గత కొన్ని రోజులుగా అనన్య పాండే, బాలీవుడ్ యువ హీరో ఆదిత్య కపూర్ తో ప్రేమలో ఉందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఓ పార్టీలో అనన్య, ఆదిత్య క్లోజ్ గా ఉండటంతో ఈ వార్తలు మరింత ఎక్కువయ్యాయి. వీటిపై అనన్య, ఆదిత్య ఇద్దరూ స్పందించలేదు. తాజాగా ఈ వార్తలపై అనన్య పాండే తల్లి భావన పాండే క్లారిటీ ఇచ్చింది.

Shahrukh Khan : నేను నిన్ను బాగా పెంచాను.. యాడ్ విషయంలో కూతురిపై షారుఖ్ స్పెషల్ పోస్ట్..

తాజాగా భావన పాండే బాలీవుడ్ లో ఓ మీడియాతో మాట్లాడుతుండగా వారు అనన్య లవ్ గురించి అడిగారు. దీంతో భావన సీరియస్ అయి.. ఈ వృత్తిలో ఇలాంటి రూమర్స్ సహజంగానే వస్తాయి. అంతే కానీ అవి నిజం అయిపోవు. అనన్య ప్రస్తుతం ఎవరితో ప్రేమలో లేదు. నటీనటుల జీవితాల్లో ఇలాంటి రూమర్స్ ఒక భాగం మాత్రమే. మీరు విన్నవన్నీ అబద్ధాలు అని తెలిపింది. దీంతో అనన్య పాండే ఎవరితో ప్రేమలో లేదని ఆమె తల్లి క్లారిటీ ఇచ్చింది.