Ari : ఎట్టకేలకు రిలీజ్ కి రెడీ అయిన అనసూయ సినిమా.. అనేక వాయిదాల తర్వాత.. రిలీజ్ ఎప్పుడంటే?

సైకో మైథలాజికల్ థ్రిల్లర్‌గా ఈ అరి సినిమా తెరకెక్కింది.

Ari : ఎట్టకేలకు రిలీజ్ కి రెడీ అయిన అనసూయ సినిమా.. అనేక వాయిదాల తర్వాత.. రిలీజ్ ఎప్పుడంటే?

Anasuya Ari Movie Releasing Date Announced

Updated On : May 24, 2025 / 7:40 PM IST

Ari Movie : పేపర్ బాయ్ మూవీ ఫేమ్ డైరెక్టర్ జయశంకర్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన సినిమా ‘అరి’. ఈ సినిమాలో సుమన్, ఆమని, సాయికుమార్, శుభలేఖ సుధాకర్, అనసూయ, సురభి ప్రభావతి, వైవా హర్ష ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ట్రైలర్, గ్లింప్స్ రిలీజ్ చేసి ఆసక్తి పెంచారు.

Also Read : Pawan Kalyan : రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు థ్యాంక్యూ.. సినీపరిశ్రమపై డిప్యూటీ సీఎం కౌంటర్.. ఇకపై డైరెక్ట్ గా ఎవరూ కలవద్దు..

ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రాబోతుంది. సైకో మైథలాజికల్ థ్రిల్లర్‌గా ఈ అరి సినిమా తెరకెక్కింది. భగవద్గీత సారాన్ని ఈ అరి సినిమాలో చూపించారు. ఆల్రెడీ ఈ సినిమాను పలు స్పెషల్ షోస్ వేసి చూపించారు. ఇప్పటికే పలుమార్లు ఈ సినిమా వాయిదా పడింది. తాజాగా అరి సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. మే 30న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఎట్టకేలకు అనేక వాయిదాల తర్వాత రిలీజ్ అవుతున్న అరి సినిమా ఎలా మెప్పిస్తుందో చూడాలి.

Anasuya Ari Movie Releasing Date Announced