Anasuya Bharadwaj
Anasuya Bharadwaj : ఇటీవల నటుడు శివాజీ హీరోయిన్స్ మంచి బట్టలు వేసుకోండి అని చెప్పిన మాటలకు అనసూయ మీరెవరు చెప్పడానికి, ఆడవాళ్లను కంట్రోల్ చేస్తున్నారు అంటూ ఫైర్ అయింది. దీంతో మంచి చెప్పడం కూడా తప్పేనా అని నెటిజన్లు, జనాలు అనసూయపై ఫైర్ అవుతున్నారు.(Anasuya Bharadwaj)
గతంలో అనసూయ జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోలలో ఆమె మాట్లాడిన డబల్ మీనింగ్ డైలాగ్స్ బయటకు తీసి మీరు అప్పుడు అలా చేసి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో అనసూయ హీరోయిన్ రాశి గురించి అసభ్యకరంగా మాట్లాడిన వీడియోని వైరల్ చేసారు. దీనిపై రాశి స్పందిస్తూ శివాజీ చెప్పింది కరెక్ట్. అనసూయ మాత్రం అలా మాట్లాడింది, లీగల్ గా వెల్దామనుకున్నా అంటూ ఫైర్ అయింది.
Also Read : Ajay Bhupathi : కృష్ణ గారి ఫోటో చూడగానే ఫిక్స్ అయ్యా.. మహేష్ కొడుకుని హీరోగా పరిచయం చేస్తా..
రాశి అనసూయపై ఫైర్ అవ్వడంతో తాజాగా అనసూయ రాశికి క్షమాపణలు చెప్తూ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.
అనసూయ తన పోస్ట్.. రాసి గారు నేను మీకు నిజాయితీగా క్షమాపణలు చెప్తున్నాను. మూడు సంవత్సరాల క్రితం నేను చేసిన ఒక షోలో తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్ లో మీ పేరును ఉపయోగించి నా నోటి నుంచి డబల్ మీనింగ్ డైలాగ్ చెప్పించడం జరిగింది. ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తుల్ని నేను ఆ రోజే నిలదీసి అడిగి ఉండాల్సింది కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు. అది పొరపాటే. దయచేసి నా క్షమాపణలు స్వీకరించండి. వెనక్కి వెళ్లి ఇప్పుడు నేను దాన్ని సరిదిద్దలేను. జనాలు మారుతూ ఉంటారు. మాటలని ఖండించడం దగ్గర నుంచి ఆ షో విడిచి పెట్టడం వరకు నాలోని ఆ మార్పు మీరు గమనించవచ్చు.
ఈరోజు మహిళలందరి భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్న నాకు వ్యతిరేకంగా అప్పటి ఆ మాటలు తీసి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. నన్ను షేమ్ చేయడానికి చేస్తున్న ఈ కథనాలు మీకు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో ఊహించగలను. ఆ కార్యక్రమం దర్శక రచయిత నిర్మాతలు మీకు క్షమాపణలు చెప్పినా చెప్పకపోయినా నా బాధ్యతగా నా తప్పుని అంగీకరిస్తూ మీకు క్షమాపణ చెప్తున్నాను. స్త్రీల శరీరాల చుట్టూ నిర్మించబడిన కథనాలను ప్రశ్నించడానికి నేను గతంలో కంటే బలంగా ఉన్నాను. మీరు అర్థం చేసుకుని మీ మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాను అని తెలిపింది.
దీంతో అనసూయ పోస్ట్ వైరల్ గా మారింది. మరి దీనిపై రాశి ఏమైనా స్పందిస్తుందా చూడాలి.
@RaasiActress ma’am 🙏🏻 pic.twitter.com/DZLfUNp6rr
— Anasuya Bharadwaj (@anusuyakhasba) January 5, 2026