Ajay Bhupathi : కృష్ణ గారి ఫోటో చూడగానే ఫిక్స్ అయ్యా.. మహేష్ కొడుకుని హీరోగా పరిచయం చేస్తా..
అజయ్ భూపతి మంగళవారం 2 సినిమా తీసే ముందే శ్రీనివాస మంగాపురం అనే సినిమాతో రాబోతున్నాడు.(Ajay Bhupathi)
Ajay Bhupathi
- అజయ్ భూపతి ఇంటర్వ్యూ
- మహేష్, కృష్ణ పై కామెంట్స్
- మహేష్ అన్న కొడుకుతో సినిమా
Ajay Bhupathi : RX100 సినిమాతో ఒక్కసారిగా వైరల్ అయ్యాడు డైరెక్టర్ అజయ్ భూపతి. ఆ తర్వాత మహాసముద్రం యావరేజ్ గా నిలిచినా మంగళవారం సినిమాతో అందర్నీ మెప్పించాడు. అజయ్ భూపతి సినిమా అంటే ఏదో డిఫరెంట్ గా ఉంటుంది అనేలా తనకంటూ ఓ మార్క్ తెచ్చుకున్నాడు. అజయ్ భూపతి మంగళవారం 2 సినిమా తీసే ముందే శ్రీనివాస మంగాపురం అనే సినిమాతో రాబోతున్నాడు.(Ajay Bhupathi)
మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు జయకృష్ణ హీరోగా, బాలీవుడ్ భామ రాషా తడానీ హీరోయిన్ గా శ్రీనివాస మంగాపురం సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా అజయ్ భూపతి 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్, కృష్ణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
అజయ్ భూపతి మాట్లాడుతూ.. ఈ కథ ఎప్పట్నుంచో ఉంది. జయకృష్ణ బాగా నచ్చాడు నాకు. మంగళవారం 2
పనుల్లో ఉన్నప్పుడు నాకు కాల్ వచ్చింది. అతన్ని కలవడానికి వెళ్తే వాళ్ళింట్లో హాల్ లో నవ్వుతూ ఉన్న ఒక పెద్ద కృష్ణ గారి ఫోటో ఉంది. ఆ ఫోటో చూస్తుంటే నా వైపే చూస్తున్నట్టు అనిపించింది. నన్నే చూస్తూ నవ్వుతున్నట్టు అనిపించింది. అప్పుడే జయకృష్ణతో సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యా. అప్పుడే ఈ సినిమాని ప్రస్టేజియస్ గా తీసుకున్నా. కృష్ణ గారి మనవడు హీరో కాబట్టి ఒక అంచనాలు ఉంటాయి. ఇది కొత్త అబ్బాయి అమ్మాయితో చేయాల్సిన సినిమానే. అంచనాలను రీచ్ అవుతాం అని తెలిపాడు.
అలాగే మహేష్, గౌతమ్ గురించి మాట్లాడుతూ.. RX100 తర్వాతే మహేష్ బాబు ఒకసారి పిలిపించారు. అప్పుడే మహేష్ బాబు ని కలిసాను. ఆ తర్వాత మళ్ళీ కలవలేదు. కానీ మా సినిమా షూటింగ్ అప్డేట్స్ అన్ని ఆయనకు తెలుసు. నా మీద ఆయనకు నమ్మకం ఉంది అన్నారని ఆయన వేరే వాళ్లకు చెప్పినట్టు తెలిసింది. గౌతమ్ ని లాంచ్ చేసే ఛాన్స్ వస్తే చేస్తాను. ఒకవేళ గౌతమ్ తో చేస్తే ఒక చిన్న మాస్ టచ్ తో, క్యారెక్టరయిజేషన్ లో మాస్ తో ఉండే కథతో చేస్తాను అని తెలిపారు.
Also Read : Pawan Kalyan : మళ్ళీ మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్.. ఒక్క పోస్ట్ తోనే హైప్..
