Pawan Kalyan : మళ్ళీ మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్.. ఒక్క పోస్ట్ తోనే హైప్..
ఇటీవల న్యూ ఇయర్ కి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేసారు.(Pawan Kalyan)
Pawan Kalyan
- నిర్మాతగా పవన్ కళ్యాణ్
- పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనౌన్స్
- మార్షల్ ఆర్ట్స్ జర్నీ
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరో పక్క సినిమాలు తనకు కుదిరినప్పుడల్లా చేస్తున్నారు. OG తో వచ్చి పెద్ద హిట్ కొట్టిన పవన్ త్వరలో ఉస్తాద్ భగత్ సింగ్ తో రాబోతున్నారు. OG 2 కూడా అనౌన్స్ చేసారు. ఇటీవల న్యూ ఇయర్ కి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేసారు.(Pawan Kalyan)
అయితే కొన్ని రోజుల క్రితం పవన్ హరిహర వీరమల్లు ప్రమోషన్స్ లో మీడియాతో మాట్లాడుతూ.. ఇకపై హీరోగా సినిమాలు చేస్తానో లేదో తెలీదు కానీ సినిమాల్లో మాత్రం ఉంటా. నిర్మాతగా సినిమాలు చేస్తాను అని ప్రకటించారు. గతంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై సర్దార్ గబ్బర్ సింగ్, చల్ మోహన్ రంగ సినిమాలు నిర్మించారు.
Also Read : Charan- Anil: రామ్ చరణ్ తో అనిల్ మూవీ.. క్లారిటీ ఇచ్చేశాడు.. కానీ, కండీషన్ పెట్టాడు
మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఆ సంస్థని బయటకు తీశారు. అధికారికంగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ కొత్త సోషల్ మీడియా అకౌంట్స్ ని ప్రకటించారు పవన్ కళ్యాణ్. అంతే కాకుండా ఇటీవల OG సినిమా కోసం పవన్ తన మార్షల్ ఆర్ట్స్ ని బయటకు తీసిన సంగతి తెలిసిందే. ఆ మార్షల్ ఆర్ట్స్ లో కొత్త జర్నీ రానుంది అని ప్రకటించారు. దీంతో పవన్ మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించి, దాని కోసం పవన్ పడిన కష్టాలు వీడియో రూపంలో త్వరలోనే రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ అధికారికంగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ గురించి, తన మార్షల్ ఆర్ట్స్ గురించి పోస్ట్ పెట్టడంతో పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో త్వరలోనే పవన్ కళ్యాణ్ నుంచి నిర్మాతగా సినిమాలు వస్తాయని తెలుస్తుంది. మరి పవన్ నిర్మాణంలో ఏ హీరోలు సినిమాలు చేస్తారో చూడాలి.
Also See : Anupama Parameswaran : క్యూట్ ఫొటోలతో అదరగొడుతున్న అనుపమ.. లేటెస్ట్ ఫొటోలు చూశారా..?
