Charan- Anil: రామ్ చరణ్ తో అనిల్ మూవీ.. క్లారిటీ ఇచ్చేశాడు.. కానీ, కండీషన్ పెట్టాడు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Charan- Anil) తో సినిమా చేయడంపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి.

Charan- Anil: రామ్ చరణ్ తో అనిల్ మూవీ.. క్లారిటీ ఇచ్చేశాడు.. కానీ, కండీషన్ పెట్టాడు

Director Anil Ravipudi interesting comments about a film with Ram Charan

Updated On : January 5, 2026 / 6:56 AM IST
  • రామ్ చరణ్ తో అనిల్ రావిపూడి మూవీ
  • త్వరలో అంటూ చెప్పిన అనిల్
  • ముందు మన శంకరవరప్రసాద్ గారు హిట్ అవ్వాలట

Charan- Anil: టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న దర్శకులలో మినిమమ్ గ్యారంటీ దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది అనిల్ రావిపూడి అనే చెప్పాలి. ఆయన ఇప్పటివరకు చేసిన ఒక్క సినిమా కూడా ప్లాప్ అవలేదు అంటే అర్థంచేసుకోవచ్చు ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటి అనేది. కామెడీ అనేది ఆయన స్ట్రెంత్ చేసుకున్నాడు. వరుసగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలను చేస్తూ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో అలరిస్తున్నాడు.

ఇప్పుడు మరోసారి కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అదే మన శంకరవరప్రసాద్ గారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

Malavika Mohanan: నాచే నాచే సాంగ్ లో మాళవిక గ్లామర్ రచ్చ.. ఫొటోస్

ఈ ట్రైలర్ ఈవెంట్ తిరుపతిలో జరిగింది. ట్రైలర్ కూడా ఎంతెర్తైనింగ్ గా ఉండటంతో ఆడియన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ ట్రైలర్ ఈవెంట్ లో అనిల్ రావిపూడి మాట్లాడుతున్న సమయంలో ఫ్యాన్స్ అంతా రామ్ చరణ్(Charan- Anil) తో సినిమా ఎప్పుడు అంటూ అరవడం మొదలుపెట్టారు. దానికి సమాధానంగా అనిల్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ గారు ఒకరోజు ముందు మన శంకరవరప్రసాద్ గారు మూవీ ట్రైలర్ చూశారు.

ఆయనకు బాగా నచ్చింది. నవ్వుకున్నారు కూడా. అయితే, రామ్ చరణ్ తో సినిమా తప్పకుండా చేస్తాను. మీరు మన శంకరవరప్రసాద్ గారు సినిమాను బ్లాక్ బస్టర్ చేయండి. వెంటనే రామ్ చరణ్ దగ్గరకు వెళ్ళిపోతాను”అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో, అనిల్ రావిపూడి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.