Bad Girlz Review
Bad Girlz Review : అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య, రేణు దేశాయ్, యాంకర్ స్రవంతి.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘బ్యాడ్ గాళ్స్’. ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ నిర్మాణంలో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా ఫేమ్ డైరెక్టర్ ఫణి ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.(Bad Girlz Review)
రోజీ రెడ్డి, మల్లీశ్వరి, మెర్సీ, వెంకట్ లక్ష్మి.. నలుగురు అమ్మాయిలు హైదరాబాద్ హాస్టల్ లో కలిసి ఉంటారు. ఈ నలుగురు మంచి ఫ్రెండ్స్. ఇందులో ఇద్దరికీ జాన్, నాయుడు అనే వ్యక్తులలతో నిశ్చితార్థం జరుగుతుంది. పెళ్లి అయిపోతే మళ్ళీ కలవలేము ఏమో అని పెళ్లికి ముందు ఓ సారి చివరగా ట్రిప్ వేయాలని, లైఫ్ ని ఎంజాయ్ చేయాలని అనుకుంటారు ఈ నలుగురు.
దీంతో తమ రిలేటివ్ స్రవంతి సహాయంతో మలేషియాకు ట్రిప్ కి వెళ్తారు ఈ నలుగురు. అదే సమయంలో అనకొండ అనే రౌడీ మలేషియాలో బాంబు దాడిని ప్లాన్ చేస్తాడు. అదే సమయంలో ఉమెన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ ఈ నలుగురిని కిడ్నాప్ చేయాలని ప్రయత్నిస్తారు. మరి లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అనుకున్న ఈ నలుగురు మలేషియాకు వెళ్ళాక ఎదుర్కున్న సంఘటనలు ఏంటి? వుమెన్ ట్రాఫికింగ్ నుంచి ఎలా తప్పించుకున్నారు? వారికి వచ్చిన ప్రమాదాల నుంచి ఎలా బయటపడ్డారు తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also Read : Vrusshabha Review : ‘వృషభ’ మూవీ రివ్యూ.. పునర్జన్మల నేపథ్యంతో..
బ్యాడ్ గాళ్స్ అంటూ టైటిల్ తోనే ఈ సినిమాపై ఆసక్తి నెలకొల్పారు. ఇక కాస్త అడల్ట్ కంటెంట్ ఉందనిపించేలా ట్రైలర్, టీజర్ కట్ చేసి వైరల్ అయ్యారు. ఓ నలుగురు ఫ్రెండ్స్, వారి స్నేహంతో కథ మొదలయి వాళ్ళు మలేషియా ట్రిప్ కి వెళ్లడం, ఈ మధ్యలో వాళ్ళ కాబోయే భర్తలతో ప్రేమ వ్యవహారాలతో సాగుతుంది. ఈ జనరేషన్ అమ్మాయిలు ఎలా ఉండాలనుకుంటున్నారో, వాళ్ళ ఆశలు, కోరికలు చూపించారు. ఇంటర్వెల్ కి ఓ ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొల్పారు.
సెకండ్ హాఫ్ లో కామెడీ కాస్త పక్కనపెట్టి క్రైమ్, థ్రిల్లర్ గా సాగుతుంది. మలేషియాలో వీళ్ళు పడే బాధలతో సాగుతుంది. ఈ నలుగురు ఎలా తప్పించుకుంటారు అనే సీన్స్ ఉత్కంఠంగా సాగుతాయి. ఇక క్లైమాక్స్ లో ఓ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేసారు. నలుగురు అమ్మాయిలు లైఫ్ ఎంజాయ్ చేయాలి అనే ఆలోచనతో వెళ్లి అనుకోకుండా సమస్యల్లో ఇరుక్కునే ఎలా బయటకు వచ్చారు అని కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. అక్కడక్కడా ఈ అమ్మయిలు చేసే కామెడీ బాగానే వర్కౌట్ అయింది. ఫ్రెండ్స్ తో టైం పాస్ కి ఈ సినిమా చూడొచ్చు.
మెయిన్ లీడ్ లో నటించిన నలుగురు హీరోయిన్స్ అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్న.. చాలా బాగా నటించారు. ఫుల్ ఎనర్జీతో నవ్విస్తూ చివర్లో ఎమోషనల్ సీన్స్ లో మెప్పించారు. నలుగురు ఫ్రెండ్స్ గా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. మోయిన్, రోహన్ సూర్య వారి పాత్రల్లో బాగానే నటించారు. యాంకర్ స్రవంతి మొదటిసారి సినిమాలో నటించి మెప్పించింది. రేణు దేశాయ్ ఓ కీలక పాత్రలో మెరిపించింది. రాజా రవీంద్ర, తాగుబోతు రమేష్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
Also Read : Champion Review : ‘ఛాంపియన్’ మూవీ రివ్యూ.. రజాకార్లపై పోరాడిన భైరాన్ పల్లి కథ.. కొత్త నేపథ్యంలో..
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం కలర్ ఫుల్ గా బాగున్నాయి. మలేషియా లొకేషన్స్ ని బాగా చూపించారు. అనూప్ రూబెన్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ బాగానే మెప్పిస్తాయి. ఎడిటింగ్ పరంగా కొన్ని అక్కర్లేని కామెడీ సీన్స్ ని కట్ చేస్తే బాగుండు. నలుగురు అబ్బాయిలు ఫ్రెండ్స్ కథలు నడుస్తున్న సమయంలో నలుగురు అమ్మాయిలతో కొత్తగా చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘బ్యాడ్ గాళ్స్’ లైఫ్ ఎంజాయ్ చేయాలి అని ట్రిప్ కి వెళ్లిన నలుగురు అమ్మాయిల జీవితాల్లో ఎదురైన సంఘటనలు ఏంటి అని కామెడీ థ్రిల్లర్ గా చూపించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.