Jani Master – Jhansi : జానీ మాస్టర్ కేసులో ఝాన్సీ కామెంట్స్.. రెండు వారాలుగా ఈ ఇష్యూ మా పరిశీలనలో ఉంది..

జానీ మాస్టర్ కేసులో తాజాగా టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ ప్రెస్ మీట్ పెట్టింది.

Jani Master – Jhansi : జానీ మాస్టర్ కేసులో ఝాన్సీ కామెంట్స్.. రెండు వారాలుగా ఈ ఇష్యూ మా పరిశీలనలో ఉంది..

Anchor Jhansi Comments on Jani Master Case in Press Meet

Updated On : September 17, 2024 / 12:55 PM IST

Jani Master – Jhansi : నిన్న జానీ మాస్టర్ పై ఓ మహిళా కొరియోగ్రాఫర్ లైంగికంగా వేధిస్తున్నాడు అని ఆరోపణలు చేస్తూ పోలీసు కేసు పెట్టింది. అలాగే మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ బలవంతం చేసాడని, పలు మార్లు లైంగికంగా వేధించాడని, వర్క్ విషయంలో కూడా వేధించాడని ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఈ వివాదంపై తాజాగా టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ ప్రెస్ మీట్ పెట్టింది. ఈ ప్రెస్ మీట్ లో యాంకర్, నటి ఝాన్సీ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ అన్ ఆర్గనైజెడ్స్ సెక్టార్. ప్రభుత్వం తరపు నుంచి మన ఇండస్ట్రీలో మహిళా రక్షణ నిమిత్తం సరైన గైడ్ లైన్స్ లేవు. శ్రీ రెడ్డి ఇష్యూ తరువాత ఒక కమిటీ ఫామ్ అయింది. జానీ మాస్టర్ ఇష్యూ గత రెండు వారాలుగా మా కమిటీ పరిశీలనలో ఉంది. ఈ వివాదంలో బాధితురాలు మొదట వర్క్ పరంగా హరాస్మెంట్ అని వచ్చింది. ఆ తరువాత సెక్సువల్ హారాస్మెంట్ అని బయటపెట్టింది. తన స్టేట్మెంట్, జానీ మాస్టర్ స్టేట్మెంట్ కూడా రికార్డు చేశాం. అయితే సెక్సువల్ హరాస్మెంట్ అనేది వర్క్ ప్లేస్ లో కాదు. లీగల్ గా ప్రొసీడ్ అయి పోలీస్ కేసు పెట్టడం జరిగింది. దీనిపై విచారణ కొనసాగుతోంది. 90 రోజుల లోపే దీనిపై క్లారిటి వస్తుంది. అమ్మాయిలు ఎవరైనా కంప్లైట్ చేస్తే ఆమె‌ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి, ఉండాలి కూడా‌‌ అని తెలిపింది. అలాగే ఈ కేసులో బాధితురాలి వివరాలు, ఫొటోలు ఎవరూ రివీల్ చేయొద్దు అని కోరారు.

Also Read : Jani Master : జానీ మాస్టర్ కేసులో.. వారి ఫోటోలు, వీడియోలు వాడొద్దు.. ఫిలిం ఛాంబర్ విజ్ఞప్తి..

ఈ ప్రెస్ మీట్ లో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. మీడియా నుంచే జానీ మాస్టర్ వివాదం మా‌ వద్దకు వచ్చింది. 2013లో ఆసరా అని పెట్టాం. 2018లో సరికొత్తగా ప్యానల్ పెట్టాం. ఎన్ని పెట్టినా మహిళలకు దైర్యం ఇవ్వలేకపోతున్నాము. ప్రతి అమ్మాయికి తెలియాలి. తమకు సపోర్ట్ ఉందనే ధైర్యం కావాలి. అందుకు తగ్గ కమిటీ ఉండాలి. 90 రోజుల్లో జానీ మాస్టర్ కేసు సాల్వ్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో ప్రతి అమ్మాయికి రక్షణ కావాలి. ఛాంబర్ తరపున ప్రతి యూనియన్ కు ఓ‌ కంప్లైట్ కమిటీ పెట్టుకోవాలని సూచించనున్నాము. డాన్సర్ యూనియన్ కూడా ఈ విషయంలో మాతో పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు అని తెలిపారు.

 

నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. జానీ మాస్టర్ మీద ఆరోపణలు రాగానే వివాదం తేలే వరకు అతన్ని డాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఫెడరేషన్ ను ఆదేశించాము అని తెలిపారు.