×
Ad

Anchor Jhansi : చిరంజీవికి యాంకర్ ఝాన్సీ కౌంటర్ ఇచ్చిందా? వరుస పోస్టులు వైరల్..

యాంకర్ ఝాన్సీ కూడా పేరు చెప్పకుండా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో దీనికి సంబంధించి వరుస పోస్టులు పెట్టింది. (Anchor Jhansi)

Anchor Jhansi

Anchor Jhansi : ఇటీవల మన శంకర వరప్రసాద్ గారు సినిమా సక్సెస్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లాంటిది లేదు. మీరు ప్రొఫెషనల్ గా ఉండండి, ధైర్యంగా ఉండండి, ఇండస్ట్రీకి రండి అంటూ తన కూతురు సుస్మిత, నిర్మాతలు సుప్రియ, ప్రియాంక దత్, స్వప్న దత్.. లాంటి వారిని ఉదాహరణగా చెప్తూ అమ్మాయిలను ప్రోత్సహిస్తూ సినిమాల్లోకి భయపడకుండా రమ్మంటూ మాట్లాడారు.(Anchor Jhansi)

అయితే పలువురు ఈ కామెంట్స్ ని తప్పుగా ప్రచారం చేయడంతో సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అంటూ కొంతమంది చిరంజీవి కామెంట్స్ కి కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలో యాంకర్ ఝాన్సీ కూడా పేరు చెప్పకుండా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో దీనికి సంబంధించి వరుస పోస్టులు పెట్టింది.

Also Read : Indravathi Chauhan : మంగ్లీ సిస్టర్ ని చూశారా..? ఊ అంటావా ఊ ఊ అంటావా సింగర్ ఇంద్రావతి మోడ్రన్ లుక్స్..

యాంకర్ ఝాన్సీ తన పోస్టుల్లో.. కమిట్మెంట్ /క్యాస్టింగ్ కౌచ్ = పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు. వీటి గురించి నిమ్మకి నీరెత్తినట్టున్న తెలుగు సినిమా 2018లో ఉలిక్కిపడి, తమ మీద పడ్డ చెత్తని ఊడిచి చాప కింద పెట్టింది. పోష్ యాక్ట్ సినిమా పరిశ్రమకు కూడా పనిచేస్తుంది. కానీ చాలా మంది నిర్మాతలు దీన్ని పట్టించుకోరు. వదిలేయడం పరిష్కారం కాదు అని కొన్ని గొంతులు కలిసి అరిస్తే ఒక ప్యానెల్ చేయించగలిగాం. సమస్యలని గుర్తించడానికి కంప్లైంట్ చేయడం మొదటి స్టెప్. వందల మందిని వేధించిన వ్యక్తి పేరు బయటకి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని వెనుకనుంచి పని చేసుకోమనే గౌరవమిచ్చిన సినిమాలోని లీడ్ స్టార్ కి తమ ముక్కుల కింద నేరస్థులు కనిపించరు కానీ కళ్ళ ఎదురుగా అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న అమ్మాయిలే కనపడతారు. తప్పు వాళ్లదే అని నెట్టేయడం చాలా తేలిక మాస్టారు. పెద్దింటి పిల్లల అనుభవాలు, సామాన్య పిల్లల కష్టాలు ఒకటే తరాజులో కొలవకండి మారాజా.

సందర్భం కానప్పుడు, అవగాహన లేనప్పుడు, పూర్తి చర్చ జరగనప్పుడు సినిమా వేదికలపై సైద్ధాంతిక ప్రకటనలు ఎందుకు? సంయమనం ప్లీజ్. మీరు అర్థం చేసుకోలేనంత డ్యామేజ్ జరుగుతుంది అని పోస్ట్ చేసింది.

Also Read : Ee Nagaraniki Emaindhi : అప్పుడు గోవా.. ఇప్పుడు థాయిలాండ్.. ఇరవై రెట్లు ఎక్కువ బడ్జెట్ పెట్టి సీక్వెల్ సినిమా..

అలాగే చిరంజీవి అన్న మాటలనే రాస్తూ.. అమ్మాయిలు ధైర్యంగా ఉండండి. గట్టిగా నిలబడండి, వేధింపులకి, దుర్బలత్వంకి తల వంచకండి. మీ స్కిల్, హార్డ్ వర్క్ ని గుర్తించడానికి ఎవరూ మిమ్మల్ని సెక్సువల్ ఫేవర్స్ అడగకూడదు. అడిగినా మీరు ఇవ్వకూడదు అవసరమైతే కంప్లైంట్ చేయండి. ఈ రంగంలో మహారాణిలా రాణించండి. పాపం వారు చెప్పాలనుకున్న అసలైన అర్థం ఇది కానీ పదాలు మీరు అపార్ధం చేసుకున్నారేమో అని వ్యంగ్యంగా కూడా కామెంట్స్ చేస్తూ పోస్ట్ పెట్టింది.