Akkada Ammayi Ikkada Abbayi : యాంకర్ ప్రదీప్ సెకండ్ సినిమా.. ‘అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి’ ట్రైలర్ వచ్చేసింది..

మీరు కూడా ప్రదీప్ అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి ట్రైలర్ చూసేయండి..

Anchor Pradeep Deepika Pilli Akkada Ammayi Ikkada Abbayi Movie Trailer Released

Akkada Ammayi Ikkada Abbayi : యాంకర్ ప్రదీప్ ప్రస్తుతం యాంకర్ కెరీర్ కి గ్యాప్ ఇచ్చి హీరోగా సినిమాలు చేస్తున్న తెలిసిందే. ప్రదీప్ మొదటి సినిమా 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా పర్వాలేదనిపించింది. ఇప్పుడు ‘అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి’ అనే సినిమాతో రాబోతున్నాడు. మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ పై జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకున్న డైరెక్టర్స్ నితిన్‌, భరత్‌ల ద‌ర్శ‌క‌త్వంలో ప్రదీప్, దీపికా పిల్లి జంటగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

Also See : Klin Kaara : ఉగాది పూజ చేస్తున్న చరణ్ కూతురు క్లిన్ కారా.. అమ్మ, నానమ్మతో కలిసి.. ఫొటోలు వైరల్..

ఇప్పటికే ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ మొదటి సినిమా టైటిల్ వాడటం, టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయడంతో హైప్ తెచ్చారు. తాజాగా నేడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా ట్రైలర్ చూసేయండి..

 

ఈ ట్రైలర్ చూస్తుంటే ఓ సివిల్ ఇంజనీర్ ఒక పల్లెటూరికి ఓ ప్రాజెక్టు పనికి వెళతాడు. అక్కడ తాపీ పని వాళ్ళతో, ఆ ఊరి వాళ్ళతో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, ఆ ఊర్లో ఒకే ఒక్క అమ్మాయి ఉండటం ఏంటి, ఆ అమ్మాయికి హీరోకి లవ్, ఆ అమ్మాయి 60 మందిలో ఎవర్ని పెళ్లి చేసుకుంటుంది అని ఆసక్తికర కథనంతో సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ఏప్రిల్ 11న రిలీజ్ కానుంది.