Anchor Ravi : ఒక ‘గే’ వచ్చి నా తొడ మీద చెయ్యి వేసి.. యాంకర్ రవి బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్..
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.

Anchor Ravi
Anchor Ravi : యాంకర్ గా రవి అనేక షోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు సినిమాల్లో కూడా నటించాడు. ఇటీవల బిగ్ బాస్ కి కూడా వెళ్ళొచ్చాడు. ప్రస్తుతం పలు టీవీ షోలతో యూట్యూబ్ వీడియోలతో, బయట ఈవెంట్స్ తో బిజీగానే ఉన్నాడు.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఈ క్రమంలో రవి ఒక గే వల్ల తనకు ఎదురైన అనుభవం చెప్పుకొచ్చాడు.
Also Read : Su From So : ‘సు ఫ్రం సో’ మూవీ రివ్యూ.. కామెడీ హారర్.. ఫుల్ గా నవ్వుకోవాల్సిందే..
యాంకర్ రవి మాట్లాడుతూ.. ఒక సాంగ్ షూట్ ఆర్టీసీ బస్సు లో షూట్ చేస్తున్నాము. అక్కడ షూట్ చేస్తునట్టు ఎవరికీ తెలీదు. సైలెంట్ గా కెమేరా పెట్టి చేస్తున్నాము. నేను మాములుగా కూర్చొని ల్యాప్ టాప్ లో ఏదో వర్క్ చేసుకోవాలి. బస్ లో వేరే వాళ్లు కూడా ఉన్నారు. ఒకతను ఎక్కి నా పక్కన కూర్చొని మీరు రవి కదా అని మాట్లాడాడు. నేను క్యాజువల్ గా బాగానే మాట్లాడాను. కాసేపు అయ్యాక మెల్లిగా చెయ్యి నా తొడ మీద వేసి ఏదో చేయబోయాడు. నేను అడిగేసరికి అతని ఒరిజినల్ బయటపడింది. నా మీద చేతులేసి ఏదేదో మాట్లాడసాగాడు. ఏం చేస్తున్నావు రా అయ్యా నేను అలాంటోన్ని కాదు అన్నా. నేను గట్టిగా అడిగేసరికి సైలెంట్ అయిపోయాడు అని తెలిపాడు.