Site icon 10TV Telugu

Chiranjeevi – Anchor Ravi : ఇది కదా మెగాస్టార్ అంటే.. రెండేళ్ల తర్వాత కూడా గుర్తుపెట్టుకొని.. నేను చూసి నమ్మే దేవుడు.. చిరు గురించి యాంకర్ రవి ఏం చెప్పాడంటే..

Anchor Ravi Tells Interesting thing about Megastar Chiranjeevi

Chiranjeevi Anchor Ravi

Chiranjeevi – Anchor Ravi : యాంకర్ గా అనేక షోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రవి. అడపాదడపా సినిమాలు కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం పలు టీవీ షోలతో యూట్యూబ్ వీడియోలతో, బయట ఈవెంట్స్ తో బిజీగానే ఉన్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఈ క్రమంలో రవి మెగాస్టార్ చిరంజీవి గురించి ఓ ఆసక్తికర సంఘటన తెలిపాడు.

యాంకర్ రవి మాట్లాడుతూ.. ఇది మా ప్రేకథ నా మొదటి సినిమా హీరోగా. చిరంజీవి గారు మీలో ఎవరు కోటీశ్వరుడు చేసేటప్పుడు ఆయన్ని కలిసి నా సినిమా టీజర్ లాంచ్ చేయమని అడుగుదాం అనుకున్నా. అప్పటిదాకా ఆయన్ని కలవలేదు అసలు. ఆ షో మాటీవీ కాబట్టి, నాకు మాటీవీ బాగా తెలుసుకాబట్టి వాళ్ళను అడిగి కలిస్తే చాలు అనుకున్నా. వాళ్ళు చిరంజీవి గారు చూసి పిలిస్తే కలవడం తప్ప మేము ఏమి చేయలేము వెయిట్ చెయ్ అన్నారు. కోటీశ్వరుడు షూటింగ్ అయ్యేదాకా అక్కడే వెయిట్ చేశా. ఆయన కలిసి టీజర్ లాంచ్ చేస్తే చాలు అని దేవుడ్ని దండం పెట్టుకున్నా. నేను చూసి నమ్మే దేవుడు చిరంజీవి మాత్రమే.

Also Read : Anchor Ravi : ఒక ‘గే’ వచ్చి నా తొడ మీద చెయ్యి వేసి.. యాంకర్ రవి బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్..

షూట్ అయ్యాక నా ఎదురుగా ఒక 20 మంది ఉన్నారు. చిరంజీవి గారు నన్ను దాటుకొని వెళ్లి మళ్ళీ వెనక్కి వచ్చి మీరేంటి ఇక్కడ అని నన్ను అడిగారు. అంతే నేను ఆయనకు తెలుసా అని షాక్ అయ్యా. సర్ ఒక రెండు నిముషాలు మాట్లాడాలి అని అడిగితే పక్కన అసిస్టెంట్ కి లోపలి తీసుకురా అని చెప్పారు. అంతే చాలు ఈ జన్మకి అనుకున్నా. లోపలికి వెళ్లి ఒక సినిమా చేసాను, టీజర్ రిలీజ్ చేయాలి సర్ అని అడిగితే ఓకే ఎక్కడికి రావాలి అని అడిగారు. నా కోసం మీరు ఎక్కడికో ఎందుకు సర్, ఇక్కడే టీజర్ ల్యాప్ టాప్ లో చూసి రిలీజ్ చేస్తే చాలు. ఒక వీడియో బైట్ తీసుకుంటాం అని అడిగితే ఓకే అని టీజర్ చూసి బయట ఉన్న డైరెక్టర్ ని కూడా పిలిచి అతనితో మాట్లాడి నా సినిమా గురించి బైట్ ఇచ్చారు.

టీజర్ చూసాక మీ లాంటి యంగ్ బ్లడ్ రావాలి, ఏమన్నా కావాలంటే నాకు చెప్పు అని అన్నారు. సినిమా రిలీజయ్యాక చూపించు అన్నారు. కానీ సినిమా ఆడలేదు అందుకే ఆయన్ని మళ్ళీ కలవలేదు. తర్వాత సినిమా రిలీజయిన రెండేళ్లకు జీ తెలుగు అవార్డుల ఈవెంట్ కి చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. నేను దానికి యాంకర్ గా చేసాను. ఆయన నన్ను చూసి నాకు ఇంకా సినిమా చూపెట్టలేదు కదా అని గుర్తుంచుకొని అడిగారు. నేను ఫ్లాప్ అయింది, ఎలా చూపెట్టాలో తెలియలేదు సర్ అని అంటే సినిమా సినిమానే. రిజల్ట్ ఎలా ఉన్నా కష్టపడ్డాం అని అన్నారు. తర్వాత ఆయన మనిషికి పెన్ డ్రైవ్ లో సినిమా ఇవ్వు అంటే ఇచ్చాను. ఈ బాడీ కాలిపోయేవరకు నేను చిరంజీవి అభిమానినే. ఆయన మీద స్వచ్ఛమైన ప్రేమ. ఆయన బాగుండాలి. రెండేళ్ల తర్వాత కూడా ఆయన నన్ను, నా సినిమాని గుర్తుపెట్టుకొని మరీ అడిగారంటే అది ఆయన గొప్పతనం అని మెగాస్టార్ గురించి చెప్పుకొచ్చాడు.

Also Read : Su From So : ‘సు ఫ్రం సో’ మూవీ రివ్యూ.. కామెడీ హారర్.. ఫుల్ గా నవ్వుకోవాల్సిందే..

Exit mobile version