Bigg Boss 5 Telugu : ప్రియ కామెంట్స్‌పై రవి భార్య రియాక్షన్.. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే..

యాంకర్ రవి, లహరిలపై ప్రియ చేసిన కామెంట్స్ గురించి సోషల్ మీడియా ద్వారా రవి భార్య స్పందించారు..

Bigg Boss 5 Telugu : ప్రియ కామెంట్స్‌పై రవి భార్య రియాక్షన్.. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే..

Anchor Ravi Wife

Updated On : September 21, 2021 / 5:58 PM IST

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్‌లో వీకెండ్ ఎలిమినేషన్ తర్వాత ఆడియన్స్ అంత ఈగర్‌గా వెయిట్ చేసేది సోమవారం ఎపిసోడ్ గురించే. ఎందుకుంటే ఆరోజు నామినేషన్స్ హంగామా మామూలుగా ఉండదు మరి. అప్పటివరకు క్లోజ్‌గా ఉన్నవాళ్లు కూడా ఎనిమీస్ అయిపోతుంటారు. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో నటి ప్రియ.. యాంకర్ రవి, లహరిల గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. దీంతో సన్నీ, లహరి, రవి ఆమె మీద ఫైర్ అయ్యారు. చివరకు సారీ చెప్పింది ప్రియ. అయితే ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.

Bigg Boss 5 Telugu : నామినేషన్ ఎపిసోడ్‌లో రచ్చ రచ్చ చేశారు..

లహరి ఎప్పుడూ అబ్బాయిలతోనే తిరుగుతుందని, అర్థరాత్రి వాష్ రూంలో రవిని హగ్ చేసుకుందని ఆరోపణలు చెయ్యడం వివాదాస్పదంగా మారింది. ఇప్పుడు ఈ విషయం గురించి యాంకర్ రవి భార్య నిత్య సక్సేనా స్పందించారు. రవి ఫ్యాన్స్, నెటిజన్లు.. సోషల్ మీడియాలో మెసేజ్‌లు చేస్తుండడంతో రవి భార్య స్పందించారు.

Tamannaah : తన సమస్యను బయటకు చెప్పలేనంటున్న తమన్నా..

‘చాలా మంది ఈ ఇష్యూ గురించి రెస్పాండ్ అవుతూ నాకు మెసేజ్‌లు చేస్తున్నారు. మామీద చూపిస్తున్న ప్రేమకు థ్యాంక్స్.. నేను బాగానే ఉన్నాను. రవికి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా పెద్ద థ్యాంక్స్. రవి, నేను డిఫికల్ట్ సిచ్చువేషన్స్ ఫేస్ చేశాం. మా మధ్య చెరగని నమ్మకం మమ్మల్ని మరింత బలోపేతం చేసింది’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
నిత్య పోస్ట్ గురించి రవి ఫ్యాన్స్ స్పందిస్తూ.. ‘అన్నయ్య కచ్చితంగా టైటిల్ గెలుస్తాడు.. వైఫ్ అంటే మీలా ఉండాలి.. నిజమైన ప్రేమ అంటే మీదే.. ప్రియని ఈ వారం ఎలిమినేట్ చెయ్యాల్సిందే..’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Nitya Saxena (@nitya.saxena1186)