Suma Kanakala : వెంకటేశ్వర స్వామి మాలలో రాజీవ్ కనకాల.. తిరుమలలో సుమ దంపతులు..

సుమ, రాజీవ్ కనకాల తిరుమలలో సందడి చేశారు. వెంకటేశ్వర స్వామి మాలలో..

Suma Kanakala : వెంకటేశ్వర స్వామి మాలలో రాజీవ్ కనకాల.. తిరుమలలో సుమ దంపతులు..

Anchor Suma Rajeev Kanakala at tirumala

Updated On : October 4, 2023 / 7:52 PM IST

Suma Kanakala : టాలీవుడ్ యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీవీ షోలు, సినిమా ఈవెంట్స్ అంటూ సుమ రోజు ఆడియన్స్ ముందుకు వస్తూనే ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కనిపిస్తుంటుంది. ఇక రాజీవ్ కనకాల సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను పలకరిస్తుంటాడు. రీసెంట్ గా పెద్దకపు 1 సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.

Also Read : Month of Madhu : లవర్స్ కోసం ‘మంత్‌ ఆఫ్‌ మధు’ సీక్రెట్ స్క్రీనింగ్.. మీరుకూడా వెళ్తారా..?

తాజాగా సుమ, రాజీవ్ తిరుమలలో కనిపించారు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే సుమ.. తన ఇన్‌స్టాలో ఒక వీడియో స్టోరీ పెట్టింది. ఆ వీడియోలో సుమ అండ్ రాజీవ్ తిరుమల ఘాట్ రోడ్డులో కనిపిస్తున్నారు. కారు పక్కన ఆపి తిరుమల కోన అందాలను సుమ దంపతులు వికిస్తున్న దృశ్యం ఆ వీడియోలో కనిపిస్తుంది. అలాగే ఆ వీడియో రాజీవ్ వెంకటేశ్వర స్వామి మాల ధరించి కనిపిస్తున్నాడు.

Anchor Suma Rajeev Kanakala at tirumala

Anchor Suma Rajeev Kanakala at tirumala

Anchor Suma Rajeev Kanakala at tirumala

Anchor Suma Rajeev Kanakala at tirumala