Anchor Suma Son Roshan Kanakala First Movie Bubblegum Trailer Released
Roshan Kanakala : యాంకర్ సుమ కనకాల(Suma Kanakala) తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. గతంలో నిర్మల కాన్వెంట్ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు రోషన్. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. క్షణం, కృష్ణ అండ్ హిస్ లీల సినిమాలతో మెప్పించిన దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రోషన్ కనకాల ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాకు ‘బబుల్ గమ్’(Bubble Gum) అనే వెరైటీ టైటిల్ ని పెట్టారు. ఇందులో మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక ఈ ‘బబుల్ గమ్’ సినిమా ప్రమోషన్స్ గ్రాండ్ గానే చేస్తుంది సుమ. కొడుకుని హీరోగా గ్రాండ్ లాంచ్ చేయడానికి సినీ స్టార్స్ అందర్నీ వాడేస్తుంది. ఇప్పటికే టీజర్, సాంగ్స్ రిలీజవ్వగా ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి రానా, రాఘవేంద్రరావు ముఖ్య అతిథులుగా వచ్చారు.
ఇక ట్రైలర్ లో రోషన్ బాగా నటించాడు. మొదటి సినిమాలోనే ముద్దులతో రెచ్చిపోయాడు. షర్ట్ తీసేసి బాడీ చూపిస్తూ బాగా బోల్డ్ గా నటించాడు. ట్రైలర్ చూస్తుంటే.. హైదరాబాద్ బస్తీల్లో ఉండే ఓ కుర్రాడు డీజే అవ్వాలనుకుంటాడు. ఈ గ్యాప్ లో ఓ అమ్మాయి పరిచయం అవుతుంది. కానీ ఆ అమ్మాయి ఇతనితో క్లోజ్ అయి ఆ తర్వాత వేరే వాళ్ళతో తిరగడం మొదలుపెట్టడంతో తట్టుకోలేక డీజేగా సక్సెస్ సాధించి ఆ అమ్మాయిపై రివెంజ్ తీర్చుకోవడం కథాంశం అని తెలుస్తుంది.
Also Read : Fighter : ‘ఫైటర్’ నుంచి ఏకంగా వీడియో సాంగ్ రిలీజ్.. ‘షేర్ కుల్ గయ్’ సాంగ్ చూశారా..?
ప్రస్తుతం రోషన్ కనకాల బబుల్ గమ్ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. మరి మొదటి సినిమాతో హీరోగా రోషన్ ఎలా మెప్పిస్తాడో చూడాలి. ఇక ఈ సినిమా డిసెంబర్ 29న రిలీజ్ కాబోతుంది.