Fighter : ‘ఫైటర్’ నుంచి ఏకంగా వీడియో సాంగ్ రిలీజ్.. ‘షేర్ కుల్ గయ్’ సాంగ్ చూశారా..?
ఫైటర్ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. మరో పక్క ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా నుంచి 'షేర్ కుల్ గయ్' అని సాగే సాంగ్ ని విడుదల చేశారు.

Sher Khul Gaye Song Released from Hrithik Roshan Fighter Movie
Fighter Song : బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్.. వార్, పఠాన్ లాంటి యాక్షన్ సినిమాల తర్వాత ఇప్పుడు హృతిక్ రోషన్(Hrithik Roshan) తో మరోసారి కలిసి ‘ఫైటర్’ సినిమాతో రాబోతున్నారు. హృతిక్, దీపిక పదుకోన్(Deepika Padukone), అనిల్ కపూర్(Anil Kapoor) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఫైటర్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ ఈ సినిమా నుంచి ఓ హై రేంజ్ యాక్షన్ టీజర్ కూడా రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో హృతిక్, దీపికా, అనిల్ కపూర్.. ఫైటర్ జెట్ పైలట్స్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాని 2024 జనవరి 25న రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ ప్రకటించారు. ఫైటర్ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. మరో పక్క ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా నుంచి ‘షేర్ కుల్ గయ్’ అని సాగే సాంగ్ ని విడుదల చేశారు.
సాధారణంగా సినిమా రిలీజ్ కి ముందు లిరికల్ సాంగ్స్ విడుదల చేస్తారు. కానీ ఫైటర్ నుంచి ఏకంగా వీడియో సాంగ్ రిలీజ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ పాట పబ్ లో షూట్ చేశారు. సినిమాలో పార్టీ సాంగ్ అని తెలుస్తుంది. ఈ సాంగ్ లో హృతిక్ రోషన్ తో పాటు దీపిక పదుకోన్ కూడా స్టెప్పులతో అదరగొట్టేసింది. మధ్యలో అనిల్ కపూర్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం హిందీలోనే ఈ సాంగ్ రిలీజ్ చేశారు.