Anchor Syamala : వైసీపీ ప్రచారంలో యాంకర్ శ్యామల.. ఆ ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతుగా..

యాంకర్, నటి శ్యామల భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాస్ రావుకు మద్దతుగా ప్రచారం చేయడానికి వెళ్ళింది.

Anchor Syamala Campaigning to YCP Party in AP Elections

Anchor Syamala : ఏపీలో ఎన్నికలు(AP Elections) మరో రెండు వారాల్లో ఉండటంతో రోజురోజుకి ఎలక్షన్ హీట్ పెరిగిపోతుంది. అన్ని పార్టీలు ప్రచారంలో బిజీ అయిపోయాయి. ఇక అన్ని పార్టీలు సినీ గ్లామర్ ని కూడా తమ ప్రచారంలో ఉపయోగిస్తున్నాయి. ఈ క్రమంలో యాంకర్, నటి శ్యామల భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వైసీపీ(YCP) అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాస్ రావుకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. శ్యామల గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.

నిన్న ప్రచారంలో భాగంగా అక్కడి మీడియాతో యాంకర్ శ్యామల మాట్లాడుతూ.. ”2019లో నేను వైసీపీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక మొదట ప్రచారం చేసింది శ్రీనివాసరావు గారికే. అప్పుడు మహిళలతో పెద్ద ఎత్తున ప్రచారం చేశాను. అవంతి గారిని గెలిపించారు. అన్న మాట ప్రకారం జగనన్న సంక్షేమ పథకాలు ఇస్తూ.. మీరు ప్రయోజనం పొందితేనే నాకు ఓటు వేయండి అని ధైర్యంగా చెప్తున్నారు.

ఓటు వేసి తర్వాత 5 సంవత్సరాల భవిష్యత్తుని మనం ఎంచుకుంటున్నాము. ఓటు వేసేముందు ఒక్కసారి ఆలోచించండి. హామీలు ఇచ్చి నెరవేర్చే ప్రభుత్వానికి ఓటేస్తారా? హామీలు ఇచ్చి వదిలేసే ప్రభుత్వానికి ఓటేస్తారా అనేది మీ ఇష్టం. ఇవాళ ఇక్కడ వైఎస్సార్ కాలనీకి రావడం జరిగింది. ఇక్కడ ప్రజలు నాయకులు వచ్చారని కాకుండా కుటుంబ సభ్యులు వచ్చారని మమ్మల్ని ఆదరిస్తున్నారు. వైఎస్సార్ కాలానికి వైసీపీ కుటుంబం అంతా కలిసి క్యాంపెయినింగ్ చేయడానికి వచ్చింది” అంటూ మాట్లాడారు.

Also Read : Devi Prasad – Thotapalli Madhu : మరణించిన నటీనటులపై సీనియర్ రచయిత సంచలన వ్యాఖ్యలు.. గట్టి కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్..

ఇక శ్యామల ఈ వీడియోని షేర్ చేస్తూ.. ”ఈరోజు విశాఖపట్టణం భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి) గారు, అలాగే వారి కుమార్తె ఆరవ వార్డు కార్పొరేటర్ అయిన ప్రియాంక ముత్తంశెట్టితో కలిసి ప్ర్రచారంలో పాల్గొనడం జరిగింద”ని పోస్ట్ చేశారు.