Devi Prasad – Thotapalli Madhu : మరణించిన నటీనటులపై సీనియర్ రచయిత సంచలన వ్యాఖ్యలు.. గట్టి కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్..

తోటపల్లి మధు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ వైరల్ అవ్వగా పలువురు ఈయన్ని విమర్శిస్తున్నారు. దర్శకుడు దేవి ప్రసాద్ ఈయన ఇంటర్వ్యూపై సోషల్ మీడియాలో గట్టి కౌంటర్ ఇస్తూ ఓ పెద్ద పోస్ట్ చేశారు.

Devi Prasad – Thotapalli Madhu : మరణించిన నటీనటులపై సీనియర్ రచయిత సంచలన వ్యాఖ్యలు.. గట్టి కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్..

Director Devi Prasad Counter to Writer Thotapalli Madhu Interview social media post goes Viral

Updated On : April 29, 2024 / 9:57 AM IST

Devi Prasad – Thotapalli Madhu : ఇటీవల పలువురు సెలబ్రిటీలు ఇంటర్వ్యూలలో ఏవేవో మాట్లాడేస్తున్నారు. ఒక్కోసారి వాళ్ళు చెప్పేవి నిజాలేనా అనిపించేలా మాట్లాడుతున్నారు. తాజాగా సీనియర్ నటుడు, రచయిత తోటపల్లి మధు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో సావిత్రి, శ్రీదేవి, జయలలిత, శోభన్ బాబు, MGR, జంధ్యాల, కోడి రామకృష్ణ.. ఇలా ఎంతోమంది గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ పర్సనల్ జీవితాల గురించి కూడా మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు.

తోటపల్లి మధు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ వైరల్ అవ్వగా పలువురు ఈయన్ని విమర్శిస్తున్నారు. తాజాగా నటుడు, దర్శకుడు దేవి ప్రసాద్ ఈయన ఇంటర్వ్యూపై, తోటపల్లి మధు మాట్లాడిన విధానాన్ని ఎండగడుతూ, ఆయన్ని విమర్శిస్తూ ఆయన ఫోటో షేర్ చేసి మరీ తన సోషల్ మీడియాలో గట్టి కౌంటర్ ఇస్తూ ఓ పెద్ద పోస్ట్ చేశారు.

Also Read : Baak Trailer : తమన్నా, రాశీఖన్నా హారర్ కామెడీ ‘బాక్’ ట్రైలర్ చూశారా? భయపడాల్సిందే..

దర్శకుడు దేవి ప్రసాద్ తన సోషల్ మీడియాలో తోటపల్లి మధు ఫోటో షేర్ చేస్తూ.. ఏ సినిమా అయినా రచయితతోనే మొదలవుతుంది. అందుకే నేను రచయితలను గౌరవిస్తాను. కానీ ఈ ఫొటోలో ఉన్న రచయిత తోటపల్లి మధు గారు మాత్రం కొంచెం ప్రత్యేకం. ఈయనకు కొన్ని ప్రతిభలు ఉన్నాయి. ఈయన ముందు మైక్ పెట్టి కెమెరా ఆన్ చేస్తే చాలు ఎంత పెద్దవాళ్ళనైనా వాడు, వీడు అంటూ మాట్లాడగలరు. జంధ్యాల, శ్రీదేవి, సావిత్రి గారి లాంటి వాళ్ళు ముందుకు ఎందుకు బానిస అయ్యారో ఈయన కళ్లారా చూసినట్టు చెప్పగలరు. శ్రీదేవి గారు చనిపోయేముందు ఏం జరిగిందో ఈయన అక్కడ ఉన్నట్టు మాట్లాడగలరు. MGR గారు స్విస్ బ్యాంక్ లో దాచుకున్న 3000 కోట్ల వివరాలని అయన తన టోపిలో దాచుకుంటే జయలలిత గారు దాన్ని తీసి శోభన్ బాబుకి ఎలా ఇచ్చారు, ఆయన ఆ డబ్బుతో భూములు ఎలా కొనుక్కున్నారు అని ప్రత్యక్ష సాక్షిలా చెప్పగలరు. ఎన్నో అవార్డులు అందుకున్న గొప్ప నటుడైన మురళీమోహన్ గారు అసలు ఆర్టిస్ట్ కాదని ఈయన అనగలరు. మరణించిన వారిపై కూడా ఈయన అపహాస్యం చేయగలరు. ఈయనకు అవకాశాలు ఇచ్చిన కోదండరామిరెడ్డి లాంటి వారి గురించి వ్యంగ్యంగా మాట్లాడగలరు. పాపం అసలు మందు వాసన తెలియని ఈయన ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడుతున్నారని చూసినట్టు చెప్పి ఇండస్ట్రీ ప్రతిష్టని దిగజార్చగలరు. ఈయనకు అవకాశాలిచ్చిన, ఈ లోకంలో లేని మా గురువు కోడి రామకృష్ణ గారిపై కూడా అవాకులు చెవాకులు పేలగలరు. కానీ ఈయనకు తెలియంది ఏంటంటే మా గురువుగారు లేకపోయినా ఆయన శిష్యులం ఉన్నాం. తోటపల్లి మధు గారిలో పశ్చాత్తాపం రాకపోతే వారికున్నంత కుసంస్కార ప్రతిభ మాకు లేకపోయినా వారి అసహ్యకర జుగుప్సాకర లీలలు, విన్యాసాలు మాకు తెలుసు కాబట్టి వాటిని బయట పెట్టక తప్పేట్టు లేదు అని రాసుకొచ్చారు.

 

ఇలా మరణించిన నటీనటులపై కూడా తీవ్ర విమర్శలు చేసిన తోటపల్లి మధుపై దేవి ప్రసాద్ విరుచుకుపడ్డారు. అలాగే ఆ ఇంటర్వ్యూ చేసిన యాంకర్ కి కూడా ఓ కౌంటర్ వేశారు. మరి దీనిపై తోటపల్లి మధు స్పందిస్తారేమో చూడాలి. దీంతో తోటపల్లి మధు ఇంటర్వ్యూ, దేవి ప్రసాద్ పోస్ట్ ఇండస్ట్రీలో చర్చగా మారాయి.