Baak Trailer : తమన్నా, రాశీఖన్నా హారర్ కామెడీ ‘బాక్’ ట్రైలర్ చూశారా? భయపడాల్సిందే..

తెలుగులో అరణ్‌మనై 4 సినిమా 'బాక్' అనే టైటిల్ తో రాబోతుంది. తాజాగా బాక్ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు.

Baak Trailer : తమన్నా, రాశీఖన్నా హారర్ కామెడీ ‘బాక్’ ట్రైలర్ చూశారా? భయపడాల్సిందే..

Tamannaah Rashii Khanna Aranmanai 4 Telugu Version Baak Trailer Released

Updated On : April 29, 2024 / 8:43 AM IST

Baak Trailer : తమిళ్ లో సూపర్ హిట్ హారర్ కామెడీ సినిమాల సిరీస్ అరణ్‌మనై(Aranmanai). కుష్బూ భర్త సుందర్(Sundar) దర్శకత్వంలో ఈ సినిమాలు తెరకెక్కాయి. ఇప్పటివరకు వచ్చిన అరణ్‌మనై 1, 2, 3 పార్ట్స్ పెద్ద హిట్ అయ్యాయి. ఇప్పుడు అరణ్‌మనై 4 సినిమా రాబోతుంది. కుష్బూ నిర్మాణంలో, కుష్బూ(Kushboo) భర్త మెయిన్ లీడ్ చేస్తూ ఆయన దర్శకత్వంలోనే తెరకెక్కిన అరణ్‌మనై 4 సినిమా మే 3న తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ కాబోతుంది.

తెలుగులో అరణ్‌మనై 4 సినిమా ‘బాక్’ అనే టైటిల్ తో రాబోతుంది. ఈ సినిమాలో తమన్నా(Tamannaah), రాశీఖన్నా(Rashii Khanna) ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు వర్షన్ కి కోవై సరళతో పాటు శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్ నటించారు ఈ సినిమాలో. తాజాగా నిన్న రాత్రి బాక్ (అరణ్‌మనై 4) ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కుష్బూ, తమన్నా, రాశిఖన్నా, కోవై సరళ హాజరయ్యారు. ఈ ఈవెంట్లో బాక్ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ చూస్తుంటే కథలో.. తమన్నా, అతని భర్తని ఎవరో చంపేస్తే వాళ్ళు దయ్యాలుగా మారతారు. మరోవైపు ఇంకో దయ్యం కూడా ఉంటుంది. ఓ మాంత్రికుడు ఈ ఆత్మలతో ఏదో సాధించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇక తమన్నా అన్నయ్యగా సుందర్ నటించారు. వాళ చెల్లిని ఎవరు చంపారు అని తెలుసుకోడానికి అతను ప్రయత్నం చేస్తాడు. ట్రైలర్ లోనే హారర్ అంశాలతో భయపెట్టారు. దీంతో సినిమాతో కచ్చితంగా ఫుల్ గా భయపెట్టి అక్కడక్కడా నవ్విస్తారని అర్ధమవుతుంది. సినిమాలో తల్లిప్రేమ కూడా చూపించబోతున్నారు. మీరు కూడా ఈ బాక్ ట్రైలర్ చూసి భయపడండి.

ఇక ఈ సినిమాలో బాక్ అనేది దయ్యం పేరు. అస్సాంలో బాక్ అనే పేరుతో దయ్యం ఉన్నట్టు ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. దీంతో ఆ పేరుని తెలుగు టైటిల్ కి పెట్టినట్టు కుష్బూ తెలిపారు.