Anchor Vishnupriya gives Clarity on Relation with Bigg Boss Fame Actor Prithvi Shetty
Vishnupriya – Prithvi : యాంకర్ గా, నటిగా విష్ణుప్రియ ప్రస్తుతం పలు షోలు, సిరీస్ లతో బిజీగానే ఉంది. గత సీజన్ బిగ్ బాస్ లో పాల్గొన్నప్పుడు సీరియల్ నటుడు పృథ్వీతో బాగా క్లోజ్ అయింది. షోలో ఇద్దరూ కలిసి ఆట ఆడారని అందరూ అన్నారు. షో తర్వాత కూడా అతనితో క్లోజ్ గా ఉంటూ కనిపిస్తుంది. దీంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అని వార్తలు వస్తున్నాయి.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణుప్రియ పృథ్వీతో ఉన్న రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చింది.
విష్ణుప్రియ మాట్లాడుతూ.. పృథ్వీ నాకు మంచి ఫ్రెండ్ అంతే. మంచి బాండింగ్ ఉంది అతనితో. పృథ్వీ వస్తున్నాడు అంటే నేను హ్యాపీ. పృథ్వీ పక్కన ఉంటే హ్యాపీగానే ఉంటాను. పృథ్వీ కోసమే కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోకి మళ్ళీ వచ్చాను. ఇప్పుడైతే హ్యాపీగానే ఉన్నాము. ఒకవేళ అతను లవ్ అనే టాపిక్ తో వస్తే అప్పుడు ఆలోచిస్తాను. అది జరిగినా ఓకే. జరగకపోయినా ఓకే. ఒకవేళ పృథ్వికి గర్ల్ ఫ్రెండ్ వచ్చి వెళ్ళిపోయినా నాకు ఓకే. మొదట్లో పాత రిలేషన్స్ లో తప్పులు జరిగాయి కాబట్టి ఇప్పుడు కూల్ గా ఆలోచిస్తున్నాను. ప్రస్తుతానికి నేను సింగిల్. మింగిల్ అవ్వడానికి రెడీ. పెళ్లి చేసుకుంటాను. నా వైబ్రేషన్ ఉన్న అబ్బాయి దొరికితే చేసుకుంటాను అని చెప్పింది.
దీంతో ఒకవేళ పృథ్వీ ప్రపోజ్ చేస్తే మాత్రం ఓకే చెప్తాను అని డైరెక్ట్ గానే చెప్పేసింది విష్ణుప్రియ. మరి పృథ్వీ విష్ణుకి ప్రపోజ్ చేస్తాడా? లేక ఇద్దరు వేరే వాళ్ళని చేసుకుంటారా చూడాలి.
Also Read : Balagam Actor : సినీ పరిశ్రమలో విషాదం.. ‘బలగం’ నటుడు కన్నుమూత..