Anchor Vishnupriya Gives Clarity on why She don't Accept Main Lead Movies
Vishnupriya : షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టి యాంకర్ గా పేరు తెచ్చుకుంది విష్ణుప్రియ. ఆ తర్వాత బిగ్ బాస్ తో మరింత పాపులారిటీ తెచ్చుకొని ఇప్పుడు నటిగా సినిమాలు, సిరీస్ లు, పలు టీవీ షోలతో బిజీగానే ఉంది. అయితే విష్ణుప్రియ హీరోయిన్ గా ఎందుకు చెయ్యట్లేదు, అవకాశాలు వచ్చాయా అనేదానిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది.
విష్ణుప్రియ మాట్లాడుతూ.. కెరీర్ మొదట్లో హీరోయిన్ గా ఓ సినిమా చేసాను. ఆ సినిమా తర్వాత మళ్ళీ హీరోయిన్ గా చేయకూడదు అనుకున్నా. హీరోయిన్ గా ఉంటే బాగా ట్యాన్ అయిపోయా. నా కలర్ కూడా తగ్గిపోయింది. నేను సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయా. హీరోయిన్ గా ఉండాలంటే ఫుడ్, డైట్, బ్యూటీ, స్టాఫ్ ఇవన్నీ మెయింటైన్ చేయాలి. వాటికి డబ్బులు కావలి. నా దగ్గర డబ్బులు లేవు. నాకు అన్ని మెయింటైన్ చేయాలంటే కష్టం అందుకే నేను హీరోయిన్ గా చేయను. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కొనసాగుతాను. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తమిళ్, బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వచ్చాయి. త్వరలో ఆ సినిమాల్లో చూస్తారు. తెలుగులో కూడా ఓ సినిమా చేస్తున్నాను అని తెలిపింది.