Vishnupriya : మా అమ్మ చనిపోయినప్పుడు నా ఇద్దరు ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ వచ్చి.. అప్పుడు నేను ఇంకో అబ్బాయితో డేటింగ్ లో..
తాజాగా విష్ణుప్రియ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన గురించి అనేక ఆసక్తికర అంశాలు తెలిపింది.

Anchor Vishnupriya tells about her Ex Boyfriends
Vishnupriya : షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టి యాంకర్ గా పేరు తెచ్చుకున్న విష్ణుప్రియ అందరికి పరిచయమే. బిగ్ బాస్ తో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం టీవీ షోలు, వెబ్ సిరీస్ లు, సినిమాలతో నటిగా బిజీగానే ఉంది. తాజాగా విష్ణుప్రియ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన గురించి అనేక ఆసక్తికర అంశాలు తెలిపింది.
ఈ క్రమంలో యాంకర్ నువ్వు నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ తో కూడా ఫ్రెండ్ లాగా క్లోజ్ గా ఉంటావంటా నిజమేనా అని అడిగారు.
దీనికి విష్ణుప్రియ సమాధానమిస్తూ.. నిజమే. నేను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ తో కూడా ఫ్రెండ్ గా క్లోజ్ గా ఉంటాను. అందరితో మంచిగా ఉంటాను. ఒకప్పుడు లవ్ చేశాను ఇప్పుడు చేయలేదు అంతే. చాలా మంది ఆశ్చర్యపోతారు ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ తో మంచిగా ఉంటున్నాను అని. దాంట్లో తప్పేముంది. వాళ్ళు నాతో అలాగే ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీలలో కూడా నేను తెలుసు. మా అమ్మ చనిపోయినప్పుడు నా ఇద్దరు ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ వచ్చి మొత్తం దగ్గరుండి చూసుకున్నారు. అప్పటికి నేను ఇంకో అబ్బాయితో డేటింగ్ లో ఉన్నాను. అది కూడా వాళ్లకు తెలుసు. అయినా వచ్చి మా అమ్మ చనిపోయినప్పుడు అన్ని పనులు చేసారు. అలాంటి వాళ్ళు ఉండటం నా అదృష్టం అని తెలిపింది.
ఇక విష్ణుప్రియ తల్లి 2023 లో పలు ఆరోగ్య సమస్యలతో మరణించింది. ఆ సమయంలో విష్ణుప్రియ తల్లిని తలుచుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Also Read : Spirit : ‘స్పిరిట్’ హీరోయిన్ అధికారికంగా అనౌన్స్.. అందర్నీ పక్కన పెట్టి.. యానిమల్ భామకు గోల్డెన్ ఛాన్స్..