Spirit : ‘స్పిరిట్’ హీరోయిన్ అధికారికంగా అనౌన్స్.. అందర్నీ పక్కన పెట్టి.. యానిమల్ భామకు గోల్డెన్ ఛాన్స్..
ఇలాంటి సమయంలో స్పిరిట్ సినిమా హీరోయిన్ ని అధికారికంగా ప్రకటించారు మూవీ యూనిట్.

Sandeep Reddy Vanga Announced Triptii Dimri as Female Lead in Prabhas Spirit Movie
Spirit Movie : గత కొన్ని రోజులుగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాబోతున్న స్పిరిట్ సినిమాలో హీరోయిన్ గురించి చర్చలు వస్తున్నాయి. దీపికా పదుకోన్ ని ఈ సినిమా నుంచి తీసేశారని, ఇంకో ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ ని కూడా అనుకోని ఫైనల్ చేయలేదని వార్తలు వచ్చాయి. ఇలాంటి సమయంలో స్పిరిట్ సినిమా హీరోయిన్ ని అధికారికంగా ప్రకటించారు మూవీ యూనిట్.
ప్రభాస్ స్పిరిట్ సినిమాలో త్రిప్తి దిమ్రిని హీరోయిన్ గా ప్రకటించారు. స్పిరిట్ సినిమాని రిలీజ్ చేసే అన్ని భాషల్లో త్రిప్తి దిమ్రి పేరుని రాసి ఒక పోస్టర్ రిలీజ్ చేసారు. ఆల్రెడీ సందీప్ వంగతో యానిమల్ సినిమాలో నటించి ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది త్రిప్తి దిమ్రి. ఇప్పుడు మళ్ళీ సందీప్ ఆమెకే అవకాశం ఇచ్చాడు. ఒక్క యానిమల్ సినిమాతోనే ఇండియా వైడ్ యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది ఈ భామ.
Also Read : Adivi Sesh : వామ్మో అడివి శేష్ సినిమాకు.. మ్యూజిక్ రైట్స్ కి అన్ని కోట్లా?
ఇప్పుడు స్పిరిట్ సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్ అవ్వడం ఖాయం. ఈ సినిమాలో త్రిప్తి దిమ్రి కూడా పోలీస్ పాత్రలో కనిపిస్తుందేమో అని చర్చించుకుంటున్నారు. ఇక స్పిరిట్ సినిమా షూటింగ్ డిసెంబర్ నుంచి మెక్సికో లో మొదలవుతుందని సమాచారం. మొత్తానికి యానిమల్ తో భారీ అదృష్టం రాగా స్పిరిట్ తో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది త్రిప్తి దిమ్రి.
The female lead for my film is now official 🙂 pic.twitter.com/U7JJQqSUVa
— Sandeep Reddy Vanga (@imvangasandeep) May 24, 2025