Vishnupriya : డబ్బుల కోసమే అప్పుడు చేశాను.. నాకు కొంచెం నత్తి ఉంది.. నేను వద్దు అనుకున్నా వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారు..

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణుప్రియ యాంకరింగ్ మళ్ళీ ఎందుకు చేయలేదు అనే ప్రశ్నకు స్పందించింది.

Vishnupriya : డబ్బుల కోసమే అప్పుడు చేశాను.. నాకు కొంచెం నత్తి ఉంది.. నేను వద్దు అనుకున్నా వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారు..

Vishnupriya Gives Clarity on why she give break to Anchoring

Updated On : May 25, 2025 / 8:07 PM IST

Vishnupriya : విష్ణుప్రియ షార్ట్ ఫిలిమ్స్ తో ఎంట్రీ ఇచ్చి యాంకర్ గా మారి ఫేమ్ తెచ్చుకుంది. సుధీర్ తో పోవేపోరా అనే షోతో యాంకర్ గా బాగా పాపులర్ అయింది విష్ణుప్రియ. ఆ షో తర్వాత మళ్ళీ ఏ షో యాంకర్ గా చేయలేదు విష్ణుప్రియ. ఇక బిగ్ బాస్ తర్వాత నటిగా, టీవీ షోలో కంటెస్టెంట్ గా బిజీ అయింది.

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణుప్రియ యాంకరింగ్ మళ్ళీ ఎందుకు చేయలేదు అనే ప్రశ్నకు స్పందించింది.

Also Read : Pawan Kalyan : OG డేట్ వచ్చేసింది.. ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఒకే ఇయర్ లో రెండు సినిమాలు ప్లాన్ చేసిన పవర్ స్టార్..

విష్ణుప్రియ మాట్లాడుతూ.. నాకు యాంకర్ అవ్వాలని ఇష్టం లేదు. కానీ అయ్యాను. నేను చేసిన దాంతో సాటిస్ఫాక్షన్ రాలేదు, అందుకే బ్రేక్ తీసుకున్నాను. వేరే ఏదైనా ట్రై చేయాలి అనుకున్నాను. ఆ తర్వాత ఆల్బమ్ సాంగ్స్, యాక్టింగ్ చేశాను. నేను యాంకరింగ్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు డబ్బుల కోసం చేశాను. ఆ షోలో సుధీర్ ఉండటం వల్ల నా మైనస్ లు కనపడలేదు. చేసి సరిగ్గా చేయలేదు అని బాధపడటం ఎందుకు అని మళ్ళీ చేయలేదు.

నాకు కొంచెం నత్తి ఉంది. పెద్ద పెద్దగా మాట్లాడాలి అంటే నాకు కొంచెం కష్టం. అయినా నా షో అందరికి నచ్చింది. నేను టీవీని వదిలి వెళ్దాం అనుకున్నా అది నన్ను వదలట్లేదు. ఇటీవల మళ్ళీ ఉగాది షో, మదర్స్ డే షో యాంకరింగ్ చేశాను. నాకు రాదన్నా యాంకరింగ్ చేయాలని ఆడియన్స్, టీవీ వాళ్ళు అడుగుతున్నారు. ఉగాది ఈవెంట్ అయ్యాక సరిగ్గా చేయలేదు అనిపించి నేను మళ్ళీ చేయకూడదు అనుకున్నా. కానీ వాళ్ళే మదర్స్ డే ఈవెంట్ కి యాంకరింగ్ కి అడిగారు. నా యాంకరింగ్ కి వాళ్ళు హ్యాపీనే. దాంతో నాకు వచ్చింది నేను చేస్తున్నా అని తెలిపింది.

Also Read : Vishnupriya : అందుకే నేను ఎవ్వరికి ఫొటోలు ఇవ్వను.. అక్కడ కూడా సెలబ్రిటీల ఫోటోల కోసం వస్తారు.. అది చాలా తప్పు..