Pawan Kalyan : OG డేట్ వచ్చేసింది.. ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఒకే ఇయర్ లో రెండు సినిమాలు ప్లాన్ చేసిన పవర్ స్టార్..
పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న OG సినిమా రిలీజ్ డేట్ కూడా నేడు అధికారికంగా ప్రకటించారు.

Pawan Kalyan Sujeeth They Call Him OG Movie Releasing Date Announced
Pawan Kalyan : పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఆయన చేతిలో ఉన్న సినిమాలు ఆలస్యం అవుతూ వస్తున్నాయి. కానీ ఇటీవల ఆ సినిమాలని వేగంగా పూర్తిచేసే పనిలో పడ్డారు. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా షూట్ పూర్తిచేయడంతో ఆ సినిమా జూన్ 12 రిలీజ్ కి రెడీ అయింది. పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
ఇక పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న OG సినిమా రిలీజ్ డేట్ కూడా నేడు అధికారికంగా ప్రకటించారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 25న OG సినిమా రిలీజ్ చేస్తున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం పవన్ OG సినిమాకు డేట్స్ ఇస్తున్నారు. ఓ 20 రోజులు డేట్స్ ఇస్తే షూటింగ్ పూర్తయిపోతుంది.
ఫ్యాన్స్ లో, ప్రేక్షకుల్లో OG సినిమాకు ఎంత క్రేజ్ ఉందో తెల్సిందే. పవన్ ఏ రాజకీయ మీటింగ్ కి వెళ్లినా OG OG అని అరుస్తారని తెలిసిందే. అంత హైప్ ఉన్న సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. దీంతో ఈ సంవత్సరం పవర్ స్టార్ థియేటర్స్ లో రెండు సార్లు ఫ్యాన్స్ ని అలరించబోతున్నారు.
FIRING WORLDWIDE in cinemas on
25th September 2025… 💥💥💥💥#OGonSept25#TheyCallHimOG #OG pic.twitter.com/DQAOFOrQxx
— DVV Entertainment (@DVVMovies) May 25, 2025