Vishnupriya : అందుకే నేను ఎవ్వరికి ఫొటోలు ఇవ్వను.. అక్కడ కూడా సెలబ్రిటీల ఫోటోల కోసం వస్తారు.. అది చాలా తప్పు..

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి విష్ణుప్రియ ఇంటర్వ్యూ ఇవ్వగా ఎవరైనా ఫోటోల కోసం వస్తే ఎందుకు ఇవ్వదో తెలిపింది.

Vishnupriya : అందుకే నేను ఎవ్వరికి ఫొటోలు ఇవ్వను.. అక్కడ కూడా సెలబ్రిటీల ఫోటోల కోసం వస్తారు.. అది చాలా తప్పు..

Do You Know Reason why Vishnupriya avoid photos with fans and People

Updated On : May 25, 2025 / 4:25 PM IST

Vishnupriya : సాధారణంగా సెలబ్రిటీలతో ఫోటోలు దిగాలని మాములు ప్రజలు, వాళ్ళ అభిమానులు అనుకుంటారు. సెలబ్రిటీలు ఎక్కడ కనపడినా వారితో ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపిస్తారు. సెలబ్రిటీలు కూడా ఎవరు అడిగినా ఫోటోలు ఇస్తూ ఉంటారు. అయితే సెలబ్రిటీలు ఫొటోలు ఇవ్వకపోతే అభిమానులు తిట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే యాంకర్ విష్ణుప్రియ మాత్రం ఎవ్వరికి ఫోటోలు ఇవ్వదు. ఆమె ఫ్యాన్స్ వచ్చినా కూడా ఫొటోలు ఇవ్వడానికి ఆలోచిస్తుంది.

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి విష్ణుప్రియ ఇంటర్వ్యూ ఇవ్వగా ఎవరైనా ఫోటోల కోసం వస్తే ఎందుకు ఇవ్వదో తెలిపింది.

Also Read : Kubera Teaser : నాగార్జున – ధనుష్ ‘కుబేర’ టీజర్ వచ్చేసింది..

విష్ణుప్రియ ఫోటోల విషయంపై క్లారిటీ ఇస్తూ.. నాకు చిన్నప్పటినుంచి ఫొటోస్ ఇవ్వడం ఇష్టం లేదు. బిగ్ బాస్ గెలిస్తే అందరికి ఫొటోస్ ఇవ్వాలని కూడా భయం వేసింది. నా వల్ల కాదు అలా ఫోటోలు ఇవ్వడం. నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నన్ను తెరపై చూస్తున్నంతవరకే నాకు ఆడియన్స్ కి కనెక్షన్. ఆ తర్వాత మాకు వాళ్లకు సంబంధం లేదు అనే మెంటాలిటీ నాది. తెలియని వాళ్లకు హాయ్ చెప్పాలన్న నాకు కష్టం. నేను ఇంట్రోవర్ట్. అందుకే ఫోటోలు ఇవ్వను. అందుకే పార్టీలకు కూడా వెళ్ళను. అక్కడికి వెళ్తే కొత్తవాళ్లను కలవాలని వెళ్ళను. పార్టీలకు అడిగినా నో చెప్తా.

అసలు మా ఇంట్లో మా అమ్మకి ఒక్కతే కూతురు అనుకుంటారు. నేను ఉన్నాను అని కూడా చాలా మందికి తెలిసేది కాదు. వర్క్ లేకపోతే ఇంట్లోనే ఉంటాను. కొంతమంది టెంపుల్స్ లో కూడా ఫొటోలు అడుగుతారు. అప్పుడు నాకు చాలా కోపం వస్తుంది. గుడికి, దేవుడి కోసం వచ్చి సెలబ్రిటీ వస్తే ఫోటోల కోసం వస్తారు. దేవుడ్ని వదిలేసి అలా రావడం చాలా తప్పు. దేవుడి ముందు మనం ఎంత. నేను అక్కడ ఫోటో ఇస్తే నాదే తప్పు, అహంకారం ఉన్నట్టు అవుతుంది. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ఎవరికైనా ఫోటో ఇవ్వాల్సి వస్తే నా ఫేస్, బాడీ లాంగ్వేజ్ లో ఇష్టం లేనట్టు, ఇబ్బంది పడుతున్నట్టు తెలిసిపోతుంది అని చెప్పుకొచ్చింది.

Also Read : Vishnupriya : మా అమ్మ చనిపోయినప్పుడు నా ఇద్దరు ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ వచ్చి.. అప్పుడు నేను ఇంకో అబ్బాయితో డేటింగ్ లో..