Anchor Vishnupriya Old Video goes Viral after she went to Bigg Boss House
Anchor Vishnupriya : తాజాగా తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 మొదలైంది. ఈ సారి హౌస్ లోకి 14 మంది కంటెస్టెండ్ రాగా అందులో యాంకర్ విష్ణుప్రియ కూడా ఉంది. షార్ట్ ఫిలింస్ తో కెరీర్ మొదలుపెట్టి యాంకర్ గా మరి పలు టీవీ షోలతో, సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ విష్ణుప్రియ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
అయితే విష్ణు ప్రియా గతంలో ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ కి అసలు వెళ్ళను అని చెప్పి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్లడంతో విష్ణుప్రియ పాత వీడియో వైరల్ గా మారింది. విష్ణుప్రియ గతంలో.. ఎన్ని కోట్లు ఇచ్చినా నేను వెళ్ళను. బయట ప్రపంచం చాలా అందంగా ఉన్నప్పుడు ఒక ఇంట్లో ఎందుకు ఉండాలి. ఇంట్లో వాళ్ళు ఉన్నారు, ఇంట్లో వాళ్ళను చూసుకోవాలి. నేను బిగ్ బాస్ పర్సన్ కాదు. నేను షో కూడా ఇప్పటిదాకా చూడలేదు. నేను పర్సనల్ గా కూడా బిగ్ బాస్ ఎంకరేజ్ చేయను. నేనెప్పటికీ ఆ షోకి వెళ్ళను. వెళ్తే నన్ను నిందించండి అంటూ మాట్లాడింది.
Also Read : Jr NTR : పంచెకట్టుతో ఎన్టీఆర్.. ఫ్యామిలీలతో కలిసి ఆలయంలో ఎన్టీఆర్, నీల్, రిషబ్..
అప్పుడేమో అలా మాట్లాడి ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్లడంతో నెటిజన్లు విష్ణుప్రియని ట్రోల్ చేస్తున్నారు. అయితే మనుషుల అభిప్రాయాలు మారిపోతుంటాయని, విష్ణుప్రియ బిగ్ బాస్ తన కెరీర్ కి కలిసొస్తుందని, డబ్బులు కూడా బాగా వస్తాయని వెళ్లిందని పలువురు భావిస్తున్నారు. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కూడా ఒకప్పుడు అసలు బిగ్ బాస్ కి వెళ్ళను అని చెప్పి ఇప్పుడు ప్రతి సీజన్ తనే హోస్ట్ చేస్తున్నాడు. ఇది కూడా అంతే. పరిస్థితులు, అవసరాలు మనుషులని మార్చేస్తాయి అంటే ఇదేనేమో. మరి దీనిపై హౌస్ నుంచి బయటకు వచ్చాక విష్ణుప్రియ మాట్లాడుతుందేమో చూడాలి.
Vishnu Priya 🤣🤣🤣🤣🤣#BiggBossTelugu8 pic.twitter.com/87FwBfTB36
— 49th Century When Rohit (@RohitCharan_45) September 1, 2024