Jr NTR : పంచెకట్టుతో ఎన్టీఆర్.. ఫ్యామిలీలతో కలిసి ఆలయంలో ఎన్టీఆర్, నీల్, రిషబ్..
ఆలయంలో ఎన్టీఆర్ తో పాటు రిషబ్, నీల్ కూడా పంచెకట్టుతో సాంప్రదాయంగా వెళ్లారు.
Jr NTR : ఎన్టీఆర్ గత రెండు రోజులుగా ఫ్యామిలీతో కలిసి కర్ణాటకలోని పలు ఆలయాలను సందర్శిస్తున్నారు. కన్నడ స్టార్ రిషబ్ శెట్టితో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్, వాళ్ళ ఫ్యామిలీలతో కలిసి ఎన్టీఆర్ కర్ణాటక అంతా తిరిగేస్తున్నారు. ఇప్పటికే ఉడిపి శ్రీకృష్ణ ఆలయం, కొల్లూరు శ్రీ మూకాంబిక ఆలయం, కుందుపుర బీచ్ ని సందర్శించగా అక్కడ వీరు దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also see : Balakrishna 50 Years Event : బాలకృష్ణ 50 ఏళ్ళ నట ప్రస్థానం.. స్వర్ణోత్సవ వేడుకలు.. ఫొటోలు వైరల్..
నిన్న సాయంత్రం ఎన్టీఆర్ ఫ్యామిలీతో పాటు రిషబ్, ప్రశాంత్ నీల్ ఫ్యామిలీలు కలిసి మూద్గల్ లోని శ్రీ కేశవానంతేశ్వర ఆలయాన్ని సందర్శించి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయంలో ఎన్టీఆర్ తో పాటు రిషబ్, నీల్ కూడా పంచెకట్టుతో సాంప్రదాయంగా వెళ్లారు. ఆలయం వెలుపల ఫ్యామిలీలతో దిగిన ఫోటోలను ఎన్టీఆర్ స్వయంగా తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.
ఎన్టీఆర్ వరుసగా కర్ణాటక ఆలయాల సందర్శన చేస్తుండటం, ఆ ఫొటోలు వైరల్ అవుతుండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సడెన్ గా ఈ ట్రిప్ ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.