Andhra Pradesh Deputy CM Pawan Kalyan spoke in Kannada for 30 minutes
Pawan Kalyan: తెలుగు సినిమాలపై, తెలుగు ప్రజలపై కర్ణాటకలో జరిగిన దాడుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్రతుకు తెరువు కోసం వెళ్లిన వాళ్ళను కూడా కన్నడ మాట్లాడలేదని దాడులు చేశారు. రీసెంట్ గా విడుదలైన ‘ఓజీ’ పోస్టర్లు, కటౌట్ లపై తెలుగు భాష ఉందని కాల్చేయడం చేశారు. దాంతో, కాంతార సినిమాని తెలుగు రాష్ట్రాల్లో బాయ్ కాట్ చేయాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి(Pawan Kalyan) పవన్ కళ్యాణ్ మాత్రం కళకు, బాషా బేధాలు ఉండకూడదని కాంతార సినిమాకు టికెట్ రేట్స్, అదనపు షోలకు పెర్మిషన్ ఇప్పించాడు.
అంతే కాదు, నేడు(అక్టోబర్ 6) కర్ణాటకలో జరిగిన అమృత మోహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వెళ్ళారు పవన్ కళ్యాణ్. కన్నడ భాషకు, అక్కడి ప్రజలకు గౌరవాన్ని ఇస్తూ అరగంట పాటు నాన్ స్టాప్ గా కన్నడ భాషలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో, పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కుతున్నాయి. తెలుగు ప్రజలపై, తెలుగు సినిమాలపై దాడులు జరిగినప్పటికీ కఠినంగా ఉండకుండా.. బదులుగా, ఆయన ఎంచుకున్న ఈ మార్గం ఎంతో గొప్పది అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కేవలం తెలుగు ప్రజలే కాదు కన్నడ ప్రజలు సైతం పవన్ కళ్యాణ్ విషయంలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇకనైనా తెలుగు సినిమాలపై, తెలుగు వారిపై దాడులు ఆపుతారా? ఇలానే కంటిన్యూ చేస్తారా? అనేది చూడాలి.
Deputy CM @PawanKalyan speaking Kannada ❤️
Basic Thing Should Learn Giving Respect To Other Languages like #PawanKalyan pic.twitter.com/H0C07bdfXc
— KARNATAKA PawanKalyan FC™ (@KarnatakaPSPKFC) October 6, 2025