OG Collections: 11 రోజుల్లోనే రికార్డ్స్ అన్నీ అవుట్.. 2025 హైయెస్ట్ గ్రాసర్ గా ఓజీ.. ఇది ఓజాస్ ఊచకోత

పవర్ స్టార్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అయ్యింది. ఓజీ సినిమా సృష్టిస్తున్న (OG Collections)సంచనాలు అన్నీ ఇన్నీ కాదు. మొదటిరోజు రూ.154 కొట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా కేవలం పది రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.

OG Collections: 11 రోజుల్లోనే రికార్డ్స్ అన్నీ అవుట్.. 2025 హైయెస్ట్ గ్రాసర్ గా ఓజీ.. ఇది ఓజాస్ ఊచకోత

OG movie creates new records by collecting Rs 308 crores in 11 days

Updated On : October 6, 2025 / 4:37 PM IST

OG Collections: పవర్ స్టార్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అయ్యింది. ఓజీ సినిమా సృష్టిస్తున్న సంచనాలు అన్నీ ఇన్నీ కాదు. మొదటిరోజు రూ.154 కొట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా కేవలం పది రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్(OG Collections) క్రియేట్ చేసింది. ఇప్పటికే బ్రేకీవెన్ కూడా సాధించింది ఈ సినిమా. దీంతో, రానున్న రోజుల్లో ఈ సినిమా బయ్యర్స్ కి లాభాలు తెచ్చిపెట్టనుంది. ఇక తాజాగా ఈ సినిమా మరో రికార్డ్ క్రియేట్ చేసింది.

OG Ott: ఓటీటీ రికార్డులు జాగ్రత్త.. 10 నిమిషాల ఫుటేజ్ తో ఓజీ కొత్త వెర్షన్.. స్ట్రీమింగ్ ఎప్పటినుండో తెలుసా?

అదేంటంటే, ఓజీ సినిమా ఇప్పటివరకు రూ.308 కోట్ల భారీ వసూళ్లు రాబట్టినట్టుగా మేకర్స్ తెలిపారు. దీనికి సంబంధించి అధికారిక పోస్టర్ కూడా విడుదల చేశారు. నో రూల్స్.. నో లాస్.. ఓన్లీ గంభీరాస్ లా.. అతను నిజమైన బ్యాగ్ స్టార్.. అంటూ కొత్త పోస్టర్ ను కూడా విడుదల చేశారు. దీంతో 2025లోనే హైయెస్ట్ గ్రాస్స్  కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ఓజీ నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డ్ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం పేరిట ఉండేది. ఇప్పుడా రికార్డ్ ను కేవలం 11 రోజుల్లోనే బ్రేక్ చేసింది ఓజీ మూవీ. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇక ఓజీ సినిమా విషయానికి వస్తే, గ్యాంగ్ స్టార్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు సుజీత్ తెరకెక్కించాడు. తమన్ మ్యూజిక్ అందించగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించిన నేపధ్యంలో ఓజీ ప్రీక్వెల్ అండ్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

 

View this post on Instagram

 

A post shared by DVV Entertainment (@dvvmovies)