Anee Master comments on Jani Master Issue
మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు. కాగా.. జానీ మాస్టర్ ఇష్యూపై ప్రముఖ మహిళా కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్ స్పందించారు. జానీ మాస్టర్ ఎంతో మంచివారని, ఆయన దగ్గర రెండు సంవత్సరాలు తాను అసిస్టెంట్‌గా పని చేసినట్లు చెప్పింది. జానీ మాస్టర్ కేసు విషయం విని తాను షాక్‌కు గురైయ్యానని, వారం రోజుల పాటు ఏం తోచని స్థితిలో ఉన్నట్లు తెలిపింది.
జానీ మాస్టర్‌కు వచ్చిన నేషనల్ అవార్డ్ క్యాన్సిల్ అవటం తనను చాలా బాధించిందని అనీ మాస్టర్ అంది. జానీ తప్పు చేశారని ఇంకా ఫ్రూవ్ కాలేదు. నేరం రుజువు కాకముందే అవార్డు కమిటీ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని అంది. ఆయన దగ్గర తాను రెండు సంవత్సరాలు వర్క్ చేశానని, ఆయన ఎంతో మంచి వారని తెలిపింది. ఆయనపై ఇలాంటి ఆరోపణలు రావడం భాదాకరమంది.
నిజంగా జానీ మాస్టర్ తప్పు చేసి ఉంటే శిక్ష పడాలి.. కానీ జానీ నిరపరాధి అని తేలితే ఏంటి? అని ప్రశ్నించింది. ఓ మహిళా కొరియోగ్రాఫర్‌గా చెబుతున్నాను.. ఈ ఫీల్డ్‌లో ఎంతో కష్ట పడాలని, తన కెరీర్‌లో తనకు ఎప్పుడూ కాస్టింగ్ కౌచ్ అనేది ఎదురు కాలేదని అనీ పేర్కొంది.
అప్పట్లో జానీ మాస్టర్ మంచివాడు, గొప్ప వ్యక్తి అని మీడియా ముందుకు చెప్పిన ఆ అమ్మాయి ఇప్పుడు అదే జానీ మాస్టర్ పై కేసు పెట్టడం తనకు ఆశ్చర్యంగా ఉందని తెలిపింది. ఓ డాన్సర్‌కు హెల్త్ ఇష్యూ వస్తే ఫస్ట్ హెల్ప్ చేసేది జానీ, శేఖర్, భాను మాస్టర్స్ అని, డాన్స్ మాస్టర్స్ యూనియన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది.
OG : పవన్ OG షూట్ లొకేషన్ చూశారా ?
ఇక ఏదీ ఏమైనప్పటికి కోర్టు తీర్పు ఎలా ఉంటుందోనని అందరం ఎదురుచూస్తున్నట్లుగా అనీ మాస్టర్ అంది.