Anil Ravipudi : చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమా టైటిల్ అనౌన్స్ అప్పుడే.. భగవంత్ కేసరి సీక్వెల్ గురించి కామెంట్స్..

ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి 10 టీవీతో మాట్లాడుతూ భగవంత్ కేసరి సీక్వెల్ గురించి కామెంట్స్ చేసారు. అలాగే చిరంజీవి సినిమా టైటిల్ గురించి తెలిపారు.

Anil Ravipudi

Anil Ravipudi : అనిల్ రావిపూడి ప్రస్తుతం చిరంజీవితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది. తాజాగా నేడు 71వ నేషనల్ అవార్డ్స్ ప్రకటించగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ, కాజల్, శ్రీలీల మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమాకు ఉత్తమ తెలుగు సినిమాగా అవార్డు ప్రకటించారు.

ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి 10 టీవీతో మాట్లాడుతూ భగవంత్ కేసరి సీక్వెల్ గురించి కామెంట్స్ చేసారు. అలాగే చిరంజీవి సినిమా టైటిల్ గురించి తెలిపారు.

Also Read : National Awards : తెలుగు డైరెక్టర్స్ చేసిన తమిళ్, హిందీ సినిమాలకు నేషనల్ అవార్డులు.. ఏ విభాగంలో ఎవరికి?

అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. భగవంత్ కేసరి సినిమాకు నేషనల్ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఒక మంచి కథని చెప్పాం. అది అందరికి రీచ్ అయింది. కమర్షియల్ సక్సెస్ తో పాటు అవార్డు కూడా రావడం ఆనందంగా ఉంది. భగవంత్ కేసరి సీక్వెల్ గురించి ఇప్పటిదాకా అనుకోలేదు. ఛాన్స్ ఉంటే కచ్చితంగా చేస్తాను అని తెలిపారు.

అలాగే చిరంజీవితో తీస్తున్న సినిమా గురించి మాట్లాడుతూ.. ఆగస్టు 22 చిరంజీవి పుట్టిన రోజుకు టైటిల్ అనౌన్స్మెంట్ ఉంటుంది అని తెలిపారు. గతంలో అనిల్ – చిరంజీవి సినిమాకు మన శంకర వర ప్రసాద్ అనే టైటిల్ వినిపించింది. అదే టైటిల్ అనౌన్ చేస్తారా లేక ఏదైనా కొత్త టైటిల్ ప్రకటిస్తారా చూడాలి.

Also Read : Shah Rukh Khan : 33 ఏళ్ళు.. వంద సినిమాలు.. బోలెడన్ని అవార్డులు.. గ్రేట్ సినిమాలకు కూడా రాని నేషనల్ అవార్డు ఫస్ట్ టైం ఇప్పుడు..