National Awards : తెలుగు డైరెక్టర్స్ చేసిన తమిళ్, హిందీ సినిమాలకు నేషనల్ అవార్డులు.. ఏ విభాగంలో ఎవరికి?
తెలుగు సినిమాలకే కాకుండా తెలుగు డైరెక్టర్స్ చేసిన సినిమాలకు కూడా అవార్డులు వరించాయి.

National Awards
National Awards : నేడు 2023 లో రిలీజయిన సినిమాలకు గాను 71వ నేషనల్ అవార్డ్స్ ని ప్రకటించారు. ఈ అవార్డుల్లో తెలుగు సినిమాలు అదరగొట్టాయి. వివిధ విభాగాలలో తెలుగు సినిమాలు మొత్తం ఏడు అవార్డులు గెలుచుకున్నాయి. దీంతో తెలుగు ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే తెలుగు సినిమాలకే కాకుండా తెలుగు డైరెక్టర్స్ చేసిన సినిమాలకు కూడా అవార్డులు వరించాయి. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్, సంయుక్త మెయిన్ లీడ్స్ లో తెరకెక్కించిన సినిమా వాతి. ఇది తెలుగులో సర్ గా రిలీజయింది. ఇది తెలుగు – తమిళ్ బైలింగ్వల్ గా తెరకెక్కింది. తమిళ్ వర్షన్ వాతి కు గాను బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా జీవి ప్రకాష్ కి నేషనల్ అవార్డు ప్రకటించారు.
ఇక సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ లో యానిమల్ సినిమాతో ఎంత విధ్వంసం సృష్టించాడో అందరికి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా హిట్ అయింది. యానిమల్ సినిమాకు గాను బెస్ట్ సౌండ్ డిజైన్ విభాగంలో సచిన్ సుధాకరన్, హరి హరన్ మురళీ ధరన్ లకు అవార్డు ప్రకటించారు. అలాగే యానిమల్ సినిమాకు బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి గాను హర్షవర్థన్ రామేశ్వర్ కు నేషనల్ అవార్డు ప్రకటించారు.