Shah Rukh Khan : 33 ఏళ్ళు.. వంద సినిమాలు.. బోలెడన్ని అవార్డులు.. గ్రేట్ సినిమాలకు కూడా రాని నేషనల్ అవార్డు ఫస్ట్ టైం ఇప్పుడు..
షారుఖ్ ఖాన్ ఎంత పెద్ద స్టార్ అనేది అందరికి తెలిసిందే.

Shah Rukh Khan
Shah Rukh Khan : నేడు 71వ నేషనల్ అవార్డ్స్ ని ప్రకటించారు. 2023 లో రిలీజయిన సినిమాలకు అవార్డులను ప్రకటించారు. ఈసారి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డుని విక్రాంత్ మెస్సేతో పాటు షారుఖ్ ఖాన్ కూడా గెలుచుకున్నారు. జవాన్ సినిమాకు షారుఖ్ ఖాన్ బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు గెలుచుకున్నారు.
షారుఖ్ ఖాన్ ఎంత పెద్ద స్టార్ అనేది అందరికి తెలిసిందే. ఒకరకంగా చెప్పాలంటే బాలీవుడ్ కి మన మెగాస్టార్ లాగా. సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిన్న చిన్న పాత్రలు, సీరియల్స్ చేస్తూ స్టార్ హీరోగా ఎదిగి బాలీవుడ్ ని రూల్ చేసాడు. తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
Also Read : National Award Telugu Movies : నేషనల్ అవార్డు దక్కించుకున్న తెలుగు సినిమాలు.. ఏయే ఓటీటీల్లో ఉన్నాయంటే..
ఎన్నో సూపర్ హిట్, గొప్ప సినిమాలతో మెప్పించిన షారుఖ్ ఖాన్ అనేక అవార్డులు గెలుచుకున్నాడు. బెస్ట్ యాక్టర్ గా కూడా పలు అవార్డులు గెలుచుకున్నాడు. ఫిలిం ఫేర్ అవార్డులలో అయితే ఏకంగా 12 సార్లు బెస్ట్ యాక్టర్ గా గెలుచుకున్నాడు కానీ ఇన్నేళ్లల్లో ఒక్కసారి కూడా నేషనల్ బెస్ట్ అవార్డు గెలుచుకోలేదు.
గతంలో షారుఖ్ ఖాన్ దిల్ వాలే దుల్హనియా లే జాయింగే, స్వదేశ్, వీర్ జార, చెక్ దే ఇండియా, దేవదాస్, డాన్, మై నేమ్ ఈజ్ ఖాన్.. లాంటి ఎన్నో సినిమాలలో తన నటనతో మెప్పించాడు. అలాంటి సినిమాలకు రాని నేషనల్ అవార్డు ఇప్పుడు జవాన్ అనే కమర్షియల్ సినిమాకు రావడం గమనార్హం. జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ రెండు పాత్రల్లో కనిపించి మెప్పించాడు. అయితే ఇన్నేళ్ళలో రాని నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు ఇప్పుడు షారుఖ్ ఖాన్ కి రావడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ కూడా అభినందనలు కురిపిస్తుంది.