National Award Telugu Movies : నేషనల్ అవార్డు దక్కించుకున్న తెలుగు సినిమాలు.. ఏయే ఓటీటీల్లో ఉన్నాయంటే..
తెలుగు సినిమాలకు ఏడు అవార్డులు వరించాయి.

National Award Telugu Movies
National Award Telugu Movies : నేడు 71వ నేషనల్ అవార్డ్స్ ని ప్రకటించారు. 2023 లో రిలీజయిన సినిమాలకు అవార్డులను ప్రకటించారు. ఈసారి తెలుగు సినిమాలు అదరగోట్టాయి. తెలుగు సినిమాలకు ఏడు అవార్డులు వరించాయి.
జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ “భగవంత్ కేసరి” కి అవార్డు దక్కింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ, శ్రీలీల, కాజల్ నటించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇటీవలే భగవంత్ కేసరి తెలంగాణ గద్దర్ అవార్డు కూడా గెలుచుకుంది.
హనుమాన్ మూవీకి బెస్ట్ స్టంట్ కోరియోగ్రఫీ తో పాటు బెస్ట్ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కామిక్స్ అవార్డు కూడా లభించింది. ఇలా రెండు నేషనల్ అవార్డులు గెలుచుకుంది హనుమాన్ సినిమా. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ఈ సినిమా కూడా ఇటీవల తెలంగాణ గద్దర్ అవార్డులను గెలుచుకుంది. ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
బలగం సినిమాలోని “ఊరు పల్లెటూరు” సాంగ్‌కు బెస్ట్ లిరిక్ రైటర్ గా కాసర్ల శ్యామ్ కునేషనల్ అవార్డు వచ్చింది. జబర్దస్త్ వేణు దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ మెయిన్ లీడ్స్ లో నటించిన ఈ సినిమా కూడా ఇటీవల తెలంగాణ గద్దర్ అవార్డు గెలుచుకుంది. బలగం సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ బేబీ సినిమాకు కూడా ఉత్తమ్ స్క్రీన్ ప్లే సాయి రాజేష్ కు, బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ పివిఎన్ఎస్ రోహిత్ కు నేషనల్ అవార్డులు వరించాయి. బేబీ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సుకుమార్ కూతురు సుకృతి వేణి గాంధీ తాత చెట్టుకు గాను నేషనల్ అవార్డు గెలుచుకుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్ ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతుంది.