Anil Ravipudi : బాలీవుడ్ కి వెళ్తున్న అనిల్ రావిపూడి.. సూపర్ హిట్ సినిమా రీమేక్.. ఇదే సక్సెస్ అక్కడ కూడా వస్తుందా?
సూపర్ హిట్స్ దర్శకుడు అనిల్ రావిపూడి బాలీవుడ్ కి వెళ్తాడని టాక్ నడుస్తుంది. (Anil Ravipudi)

Anil Ravipudi
Anil Ravipudi : తెలుగులో రాజమౌళి తర్వాత వంద శాతం సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి. అన్ని ఎంటర్టైన్మెంట్ సినిమాలతో ఫ్యామిలీ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతూ హిట్స్ కొడుతున్నాడు. ఈ సంవత్సరం సంక్రాంతికి వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా తీసుకొచ్చి పెద్ద హిట్ కొట్టాడు. ఏకంగా 300 కోట్ల గ్రాస్ వసూలు చేసి రీజనల్ సినిమాల్లో హైయెస్ట్ కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డ్ సెట్ చేసారు.(Anil Ravipudi)
దీంతో అనిల్ రావిపూడికి మరింత డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ఏకంగా చిరంజీవితో సినిమా చేస్తున్నాడు. అయితే తాజాగా అనిల్ రావిపూడి బాలీవుడ్ కి వెళ్తాడని టాక్ నడుస్తుంది. నిర్మాత దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నాం సినిమాని హిందీలో రీమేక్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాడట. అక్షయ్ కుమార్ ని హీరోగా అనుకుంటున్నారని సమాచారం. ఇప్పటికే బాలీవుడ్ టీమ్ కొంతమంది అనిల్ రావిపూడిని కలిసి స్క్రిప్ట్ వర్క్ గురించి మాట్లాడి వెళ్లారట.
Also Read : Naresh : పవిత్ర లోకేష్ నన్నేమని పిలుస్తుందంటే..? మా అమ్మ అయితే అలా పిలిచేది..
అక్కడ హిందీ నేటివిటీకి తగ్గట్టు ఈ సినిమాని మార్చి తెరకెక్కిస్తారట. ఇక్కడ పెద్ద హిట్ అవ్వడంతో హిందీలో కూడా సంక్రాంతికి వస్తున్నాం రీమేక్ దిల్ రాజే నిర్మిస్తాడట. అయితే ఇక్కడ సూపర్ హిట్ కొట్టి బాలీవుడ్ కి వెళ్లి రీమేక్ లు చేసి సందీప్ రెడ్డిలా సక్సెస్ అయిన వాళ్ళకంటే కూడా చేతులు కాల్చుకున్న దర్శకులు, నిర్మాతలు ఎక్కువమంది ఉన్నారు.
మరి అనిల్ రావిపూడి ఇక్కడ సక్సెస్ ని అక్కడ కూడా కొనసాగిస్తాడా? లేక అక్కడ వీరే దర్శకుడు డైరెక్ట్ చేస్తాడా చూడాలి. గతంలో అనిల్ రావిపూడికి భగవంత్ కేసరి రీమేక్ తమిళ్ లో హీరో విజయ్ తో ఛాన్స్ వస్తే నేను రీమేక్ లు చేయను అని ఆ ఆఫర్ ని తిరస్కరించాడు. మరి అనిల్ ఇప్పుడు కూడా రీమేక్ కి నో చెప్పి వేరే డైరెక్టర్కి అప్పచెప్తారా? లేక తనే హిందీలో డైరెక్ట్ చేస్తాడా చూడాలి.
Also Read : Bhadrakaali Review : విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ మూవీ రివ్యూ.. ఒక బ్రోకర్ ఏం చేశాడు..
అలాగే దిల్ రాజు వంశీ పైడిపల్లి- అమీర్ ఖాన్ కాంబోలో కూడా ఓ బాలీవుడ్ సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఆమిర్ కి కథ చెప్పగా ఆమిర్ రిప్లై కోసం ఎదురుచూస్తున్నారు.