MSVP: ‘వెంకీ గౌడ’ మాస్ ఎంట్రీ పీక్స్.. నయన్ తో రెండో పెళ్లి.. హింట్ ఇచ్చిన అనిల్ రావిపూడి
మన శంకర వరప్రసాద్ గారు(MSVP) సినిమాలో వెంకటేష్ పాత్ర గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన అనిల్ రావిపూడి.
Anil Ravipudi interesting comments about Venkatesh character Mana Shankara Varaprasad garu movie
- MSVPలో వెంకీ స్పెషల్ రోల్
- వెంకటేష్ పాత్ర గురించి హింట్ ఇచ్చిన అనిల్
- సెకండ్ హాఫ్ లో మాస్ ఎంట్రీ పీక్స్ లో ఉంటుందట
MSVP: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకరవరప్రసాద్ గారు(MSVP). నయనతార హీరోయిన్ గా వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా కాలం తరువాత చిరంజీవి వింటేజ్ లుక్ లో కనిపిస్తుండటంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకోవడంతో నార్మల్ ఆడియన్స్ సైతం ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక పండగకి పక్కా ఫ్యామిలీ సినిమా వస్తే ఎలా ఉంటుంది. గతంలో సంక్రాంతికి వస్తున్నాంతో ప్రూవ్ చేశాడు అనిల్ రావిపూడి. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.300 కోట్ల గ్రాస్ కలక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.
The Rajasaab Success Meet: ది రాజా సాబ్ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్.. ఫొటోలు
దీంతో, ఇప్పుడు మరోసారి అలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. అందుకే, బ్లాక్ బస్టర్ హిట్ పడుతుంది అంటూ నమ్మకంగా ఉన్నాడు. అయితే, ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ పాత్ర గురించి తెలిసినప్పటినుంచి ఆయన ఎలాంటి రోల్ చేస్తున్నాడు అనే క్యూరియాసిటీ ఆడియన్స్ లో నెలకొంది.
ఇందులో భాగంగానే మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో వెంకీ పాత్ర గురించి ఒక న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఇటీవల జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెంకటేష్ ఈ సినిమాలో వెంకీ గౌడ అనే పాత్రలో కనిపిస్తాడని అనిల్ చెప్పేశాడు. ఈ పాత్ర నయనతారను రెండో పెళ్లి చేసుకోవడానికి వస్తుందట. చిరుని పెళ్లి చేసుకొని విడిపోయిన నయనతారను పెళ్లి చేసుకోవడానికి మాస్ ఎంట్రీ ఇస్తాడట వెంకటేష్. ఆ పాత్ర ఎంట్రీ తరువాత సినిమా నెక్స్ట్ లెవల్ కి వెళ్తుందట. సెన్సార్ నుంచి కూడా ఈ ఇద్దరి సీన్స్ మంచి అప్లాజ్ వచ్చిందని టాక్. మరి అది వర్కౌట్ అయితే సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అవడం ఖాయం.
