మహేశ్.. నాకు స్పెషల్ మెసేజ్ పంపారు

‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లాల్ బహదూర్ స్టేడియం వేదికగా ఫుల్ జోష్‌తో జరిగింది. ప్రోగ్రాంలో యాక్టర్లతో పాటు డైరక్టర్ మాట్లాడారు. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తన ప్రయాణం గురించి చెప్తూ భావోద్వేగానికి గురవుతున్నానని కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడారు.
* చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగా. ఆయన డ్యాన్స్ చేసి ప్రైజ్ లు గెలుచుకునేవాడిని.
* విజయశాంతి చాలా చక్కగా నటించారు. గూస్ బంప్స్ వస్తాయి. పాత్రకు ప్రాణం పోశారు. పవర్ ఆఫ్ ఉమెన్ గా ఆమెని ఈ సినిమాలో చూస్తాం.
* బండ్ల గణేశ్.. మంచి పాత్ర చేశారు. బ్లేడ్ గణేశ్ అని అనకండి.
* సంగీత, రష్మిక, ఇతర క్యారెక్టర్లంతా బాగా చేశారు.
* రీ రికార్డింగ్ లో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఉంటారు.
* కొండా రెడ్డి బురుజు కూడా సెట్ వేశాం.
మహేశ్ బాబు గురించి:
F2 షూటింగ్ లో కథ చెప్పాను. ఫిబ్రవరిలో జూన్ నుంచి జులై5న షూటింగ్ స్టార్ట్ అయి 5నెలలు డిసెంబరు 18వరకూ ట్రెమండస్ జర్నీ సార్.
మీరిచ్చిన దానికి హిట్ తోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. జనవరి 11న బొమ్మ దద్దరిల్లిపోద్ది.
మహేశ్ స్పెషల్ మెసేజ్ చేశారు:
బ్రదర్.. నేను లైఫ్ లో చాలా సక్సెస్ లు చూశాను. నువ్వు ఎదుగుతున్నావు. ఈ సక్సెస్ ను నువ్వు ఎంజాయ్ చెయ్యమన్నారు.