Chiranjeevi – Anil Ravipudi : ఒక్క ట్వీట్ తో చిరంజీవి సినిమాపై బోలెడు అప్డేట్స్ ఇచ్చిన అనిల్.. పండక్కి ఓపెనింగ్.. చిరు కూతురు కూడా..

తాజాగా అనిల్ రావిపూడి చిరంజీవితో తీయబోయే సినిమాపై ట్వీట్ వేసాడు.

Anil Ravipudi Tweet on Megastar Chiranjeevi Movie

Chiranjeevi – Anil Ravipudi : వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న అనిల్ రావిపూడి ఇటీవల వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టి ఏకంగా 300 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసాడు. ఈ సినిమా తర్వాత చిరంజీవితో సినిమా ఉంటుందని అనిల్ రావిపూడి స్వయంగా చెప్పాడు.

తాజాగా అనిల్ రావిపూడి చిరంజీవితో తీయబోయే సినిమాపై ట్వీట్ వేసాడు. అనిల్ రావిపూడి తన ట్వీట్ లో.. ఫైనల్ స్క్రిప్ట్ నేరేషన్ అయిపోయింది. చిరంజీవి గారికి నా కధలో పాత్ర “శంకర్ వరప్రసాద్” ని పరిచయం చేశాను. ఆయనకు బాగా నచ్చింది, ఆ పాత్రని బాగా ఎంజాయ్ చేసారు. ఇంకెందుకు లేటు, త్వరలో ముహూర్తంతో… ‘చిరు’ నవ్వుల పండగబొమ్మకి శ్రీకారం అంటూ రాసుకొచ్చారు. ఈ ట్వీట్ కి చిరంజీవితో పాటు నిర్మాణ సంస్థలు షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ని ట్యాగ్ చేసారు.

Also Read : David Warner : మా స్లెడ్జింగ్ ముందు ఇదెంత.. రాజేంద్రప్రసాద్ కామెంట్స్ కి డేవిడ్ వార్నర్ ఏమన్నాడంటే..?

అనిల్ రావిపూడి వేసిన ఒక్క ట్వీట్ తో చిరంజీవి సినిమా గురించి బోలెడన్ని అప్డేట్స్ ఇచ్చేసారు. ఈ సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ పేరు శంకర్ వరప్రసాద్ అని చెప్పేసారు. అలాగే ఈ సినిమా నిర్మాణంలో చిరు కూతురు సుస్మిత కొణిదెల తన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ తో భాగమవుతుంది అని కూడా తెలిపారు. అలాగే ఈ సినిమా ఉగాది నాడు పూజ కార్యక్రమంతో ఓపెనింగ్ అవుతుందని హింట్ ఇచ్చేసారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిపోయింది తెలిపాడు.

ఇలా ఒక్క ట్వీట్ తో అనిల్ రావిపూడి చిరంజీవి సినిమా గురించి అప్డేట్స్ ఇచ్చేసాడు. ఇక ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతుందని తెలుస్తుంది. అలాగే చిరు అనిల్ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తారని సమాచారం. దీంతో ఇప్పట్నుంచే ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

Also Read : Ariyana Glory : మా మమ్మీ సింగిల్ మదర్ గా.. నేను, మా చెల్లి ఇండిపెండెంట్ గా ఉన్నాం అంటే.. ఎమోషనల్ అయిన అరియనా గ్లోరీ..