Ariyana Glory : మా మమ్మీ సింగిల్ మదర్ గా.. నేను, మా చెల్లి ఇండిపెండెంట్ గా ఉన్నాం అంటే.. ఎమోషనల్ అయిన అరియనా గ్లోరీ..
తాజాగా ఫ్యామిలీ స్టార్ అనే షోలో అరియనా తన ఫ్యామిలీ గురించి మాట్లాడి ఎమోషనల్ అయింది.

Ariyana Glory Emotional in TV Show while spoke about her Family
Ariyana Glory : టిక్ టాక్ వీడియోలు, రీల్స్ తో ఫేమ్ తెచ్చుకున్న అరియనా గ్లోరీ బిగ్ బాస్ లో పాల్గొని మరింత పాపులారిటీ తెచ్చుకుంది. బిగ్ బాస్ తర్వాత సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో మరింత వైరల్ అయింది. ప్రస్తుతం పలు టీవీ షోలతో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సిరీస్ లు, సినిమాలతో బిజీగానే ఉంది అరియనా. తాజాగా ఫ్యామిలీ స్టార్ అనే షోలో అరియనా తన ఫ్యామిలీ గురించి మాట్లాడి ఎమోషనల్ అయింది.
Also Read : MAD Square : ఆకట్టుకుంటున్న ‘మ్యాడ్ స్క్వేర్’ ట్రైలర్.. లడ్డు గాడి పెళ్లి తిప్పలు..
అరియనా గ్లోరీ మాట్లాడుతూ.. మా మమ్మీ సింగిల్ పేరెంట్. నేను 5 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి తను ఒక్కదే నన్ను, మా చెల్లిని పెంచింది. మా మమ్మీ, మా పెద్దమ్మ, మా అమ్మమ్మ, మా చెల్లి, నేను ఇవాళ్టికి మేము హ్యాపీగా ఇండిపెండెంట్ గా బతుకుతున్నాము. మేము ఎవ్వరి మీద ఆధారపడట్లేదు. మా అమ్మ అందరితో మంచిగా ఉండు అని నేర్పించింది. మా అమ్మమ్మ, మా పెద్దమ్మ, మా అమ్మ నా లైఫ్ లో ఎప్పటికి సూపర్ హీరోలే. వాళ్ళ పెంపకం వల్లే నేను మా చెల్లి ఇంత ఇండిపెండెంట్ గా ఇంత హ్యాపీగా ఉన్నాము. థ్యాంక్యూ మమ్మీ, లవ్ యు సో మచ్ పెద్దమ్మ నీకు కూడా అంటూ మాట్లాడింది.
దీంతో అరియనా గ్లోరీ కామెంట్స్ వైరల్ గా మారాయి. అరియనా తండ్రి వీళ్ళ చిన్నప్పుడే వదిలేసి వెళ్లిపోయాడని, అప్పట్నుంచి వాళ్ళ అమ్మే వీళ్ళని పెంచింది అని గతంలో అరియనా చెల్లి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.