MAD Square : ఆకట్టుకుంటున్న ‘మ్యాడ్ స్క్వేర్’ ట్రైలర్.. లడ్డు గాడి పెళ్లి తిప్పలు..
మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ వచ్చేసింది.

Narne Nithiin MAD Square Trailer out now
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం మ్యాడ్ స్క్వేర్. 2023లో వచ్చిన మ్యాడ్ మూవీకి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మార్చి 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది.
లడ్డు గాడి పెళ్లి ముచ్చటతో ఈ ట్రైలర్ మొదలైంది. గోవాకు వెళ్లిన తరువాత ముగ్గురు యువకులకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. వాటి నుంచి వారు ఎలా భయటపడ్డారు వంటి విషయాలతో ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. ఇక ట్రైలర్ మొత్తం నవ్వులు పూయించేలా ఉంది. మొత్తంగా ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేసింది.
Jr NTR : భార్య పుట్టిన రోజు.. జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ పోస్ట్.. పిక్స్ వైరల్..
కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్ర తెరకెక్కుతోంది. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ పై ప్రముఖ నిర్మాత హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ సమర్పకుడిగా వ్యవహారిస్తున్నారు.