David Warner : మా స్లెడ్జింగ్ ముందు ఇదెంత.. రాజేంద్రప్రసాద్ కామెంట్స్ కి డేవిడ్ వార్నర్ ఏమన్నాడంటే..?
రాజేంద్రప్రసాద్ అది సరదాగా అన్నాను అని, నేను కావాలని అనలేదు అని అయినా సారీ చెప్తున్నాను అంటూ నిన్న ఓ వీడియో రిలీజ్ చేసారు.

Director Reveals David Warner Reaction for Rajendra Prasad Comments in Robinhood Pre Release Event
David Warner : ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ నితిన్ రాబిన్ హుడ్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో తెలుగు సినిమాల డైలాగ్స్, సాంగ్స్ తో రీల్స్ చేసి మెప్పించిన డేవిడ్ వార్నర్ వెండితెరపైన కనిపిస్తుండటంతో రాబిన్ హుడ్ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా మార్చి 28న రిలీజ్ కానుంది. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది.
అయితే ఈ ఈవెంట్లో రాజేంద్రప్రసాద్ డేవిడ్ వార్నర్ తో ఉన్న చనువుతో సరదాగా నవ్వుతూనే మాట్లాడుతూ అనకూడని ఓ పదాన్ని వాడారు. దీంతో కొంతమంది డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ అంటూ రాజేంద్రప్రసాద్ పై విమర్శలు చేసారు. అయితే రాజేంద్రప్రసాద్ అది సరదాగా అన్నాను అని, నేను కావాలని అనలేదు అని అయినా సారీ చెప్తున్నాను అంటూ నిన్న ఓ వీడియో రిలీజ్ చేసారు.
డేవిడ్ కి భాష రాకపోవడంతో రాజేంద్ర ప్రసాద్ అన్న మాట అప్పుడు అర్ధం కాకపోయినా తర్వాత ఈ విషయం డేవిడ్ వార్నర్ వరకు వెళ్ళింది. దీనిపై డేవిడ్ ఏమన్నాడో రాబిన్ హుడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల క్లారిటీ ఇచ్చాడు.
వెంకీ కుడుముల ఓ ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడుతూ.. రాజేంద్ర ప్రసాద్ గారు, డేవిడ్ వార్నర్ సినిమా షూటింగ్ లో బాగా క్లోజ్ అయ్యారు. షూటిగ్ గ్యాప్ లో ఇద్దరూ నువ్వు యాక్టింగ్ రా చూసుకుందాం, నువ్వు క్రికెట్ కి రా చూసుకుందాం అని సరదాగా ఛాలెంజ్ అనుకునేవాళ్లు. దాని గురించి మాట్లాడబోయి రాజేంద్రప్రసాద్ ఆ పదం అనుకోకుండా మాట్లాడారు. ఇది డేవిడ్ వార్నర్ కి చెప్తే అవునా, ఇట్స్ ఓకే అన్నారు. నీకు క్రికెట్ లో స్లెడ్జింగ్ తెలుసా? మేము స్లెడ్జింగ్ చేస్తే చెవుల్లోంచి రక్తం వస్తుంది. మా స్లెడ్జింగ్ ముందు ఇదెంత అని అన్నారని తెలిపాడు.
Also Read : MAD Square : ఆకట్టుకుంటున్న ‘మ్యాడ్ స్క్వేర్’ ట్రైలర్.. లడ్డు గాడి పెళ్లి తిప్పలు..
ఆస్ట్రేలియా క్రికెటర్స్ అంటేనే మ్యాచ్ లో స్లెడ్జింగ్ చేస్తారని అందరికి తెలిసిందే. ఇప్పుడు డేవిడ్ వార్నర్ సైతం మేము స్లెడ్జింగ్ ఎక్కువ చేస్తాం అని చెప్తూ రాజేంద్ర ప్రసాద్ మాటలను లైట్ అని చెప్పడం గమనార్హం. అసలు విషయం తెలియక కొంతమంది సోషల్ మీడియాలో రాజేంద్రప్రసాద్ పై విమర్శలు చేస్తూ హడావిడి చేసినవాళ్లు ఈ విషయం తెలిసి సైలెంట్ అయిపోయారు.