Bholaa Shankar : రెమ్యూనరేషన్ విషయంలో చిరంజీవితో గొడవ పై నిర్మాత ట్వీట్.. ఏం చెప్పాడు..?

చిరంజీవితో గొడవ వార్తలు పై ఎట్టకేలకు స్పందించిన నిర్మాత. ఏమి చెప్పాడో తెలుసా..?

Bholaa Shankar : రెమ్యూనరేషన్ విషయంలో చిరంజీవితో గొడవ పై నిర్మాత ట్వీట్.. ఏం చెప్పాడు..?

Anil Sunkara gave clarity on conflict with Chiranjeevi Bholaa Shankar

Updated On : August 15, 2023 / 2:37 PM IST

Bholaa Shankar : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), దర్శకుడు మెహర్ రమేష్ కాంబినేషన్ లో వచ్చిన రీసెంట్ మూవీ భోళా శంకర్. తమిళ్ హిట్ మూవీ ‘వేదాళం’కి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై అనిల్ సుంకర 100 కోట్ల బడ్జెట్ తో నిర్మించాడు. ఆగష్టు 11న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అలరించలేక ప్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే, ఈ మూవీ రెమ్యూనరేషన్ విషయంలో చిరంజీవి అండ్ అనిల్ సుంకర మధ్య గొడవ జరిగినట్లు ఇటీవల ఒక వార్త నెట్టింట వైరల్ అయ్యింది.

Salman Khan : జైలులో టాయిలెట్స్ కూడా కడిగాను.. వైరల్ అవుతున్న సల్మాన్ వ్యాఖ్యలు..

ఈ వార్త పలు మీడియా వెబ్ సైట్స్ లో కూడా హాట్ టాపిక్ అవ్వడంతో ఒక మెగా అభిమాని వాట్సాప్ ద్వారా నిర్మాత అనిల్ సుంకర ని సంప్రదించగా అది ఫేక్ న్యూస్ అని ఆయన రిప్లై ఇచ్చాడు. అందుకు సంబంధించిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ కూడా నెట్టింట వైరల్ అయ్యింది. అయితే అది ఫేక్ అని, ఆ చాట్ ఫ్యాన్స్ చేసిన ఎడిట్ అని కామెంట్స్ వినిపించాయి. దీంతో అనిల్ సుంకర స్వయంగా స్పందించాడు.

Bholaa Shankar : భోళా శంకర్ తెలుగులో అయిపోయింది.. హిందీలో రిలీజ్‌కి రెడీ.. మెగాస్టార్‌కి డబ్బింగ్ ఎవరో తెలుసా?

“సోషల్ మీడియా అండ్ వెబ్ సైట్ ఆర్టికల్స్ వచ్చే వార్తల్లో కొంత కూడా నిజం లేదు. ఎటువంటి ఆధారం లేకుండా వచ్చిన రూమర్స్ అవి. దయచేసి వాటిని ఎవరు నమ్మకండి. అలాగే వాటి పై వాదనలు పెట్టకండి” అంటూ ట్వీట్ చేశాడు. కాగా వాట్సాప్ చాట్ లో అనిల్ సుంకర.. “చిరంజీవితో మరో సినిమా చేయబోతున్నట్లు, ఇప్పుడు వచ్చే విమర్శలు అన్నిటికి ఆ సినిమాతోనే సమాధానం చెబుతాను” అంటూ పేర్కొన్నాడు. ఇక తెలుగులో తన మ్యానియా చూపించలేకపోయిన భోళా శంకర్ ఇప్పుడు హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద కొంతైన కలెక్షన్స్ రాబట్టానికి సిద్దమవుతుంది.